రాష్ట్రంలో తూర్పు గాలుల ప్రభావంతో నవంబర్ 3, 4 తేదీలలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Rain Alert: నవంబర్ 3, 4 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు..! - అక్కడక్కడా భారీ వర్షాలు
రాష్ట్రంలో నవంబర్ 3, 4 తేదీల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 2 నుంచి మూడు రోజులలో అల్పపీడనం పశ్చిమ దిశలో నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉందని వివరించింది.
heavy rains in telangana on November 3rd and 4th dates
ప్రస్తుతం.. తమిళనాడు తీరానికి దగ్గరగా శ్రీలంక ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని సంచాలకులు తెలిపారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుందన్నారు. రాగల 2 నుంచి మూడు రోజులలో ఈ అల్పపీడనం పశ్చిమ దిశలో నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉందని వివరించారు.
ఇదీ చూడండి: