Telangana Weather Report: వాయువ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపుకు కదులుతూ రాగల 24గంటలలో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించారు.
బీ అలర్ట్.. రాగల 3 రోజులు భారీ వర్షాలున్నాయ్..! - తెలంగాణలో వర్షాలు
Telangana Weather Report: వాయువ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటలలో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. దాని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
rain alert
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని సంచాలకులు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇవీ చదవండి: