తెలంగాణ

telangana

ETV Bharat / city

అనంతపురంలో కుండపోత వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు - అనంతపురంలో వర్షాలు

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిధిలో కుండపోత వర్షం కురవగా.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఆర్డీటీ చెక్ డ్యాములు నిండాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఆయా గ్రామస్థులు అధిక సంఖ్యలో వస్తున్నారు.

అనంతపురంలో కుండపోత వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు
అనంతపురంలో కుండపోత వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు

By

Published : Jul 21, 2020, 3:28 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిధిలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కంబదూరు, శెట్టూరు, కుందుర్పి, బెలుగుప్ప మండల పరిధిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఆర్డీటీ చెక్ డ్యాములు నిండి నీరు బయటికి ప్రవహిస్తోంది.

ఈ దృశ్యాన్ని చూసేందుకు ఆయా గ్రామస్థులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ఎస్​టీఎల్ తన సిబ్బందితో కలిసి నిండిన చెక్​డ్యాంలను పర్యవేక్షించారు. చెక్ డ్యాములు నిండటంతో తమ గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details