రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు చెరువులయ్యాయి. ఎల్బీనగర్, నాగోల్, మన్సురాబాద్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, తుర్కయాంజల్ తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వానగోసలు: చెరువులైన కాలనీలు... ఇబ్బందుల్లో స్థానికులు
హైదరాబాద్‌లోని పలు కాలనీలు చెరువులయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమై... స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో రోజువారి పనులు చేసుకోలేక జనజీవనం స్తంభించిపోయింది.
వానగోసలు: చెరువులైన కాలనీలు... ఇబ్బందుల్లో స్థానికులు
రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి గండిచెరువు వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయం కాగా... రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ ఛైర్మన్ మల్రెడ్డి అనురాధ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వర్షపు నీరు నిల్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.