రాష్ట్రంలో నేడు పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పు, ఆగ్నేయం దిక్కుల నుంచి తెలంగాణ మీదకు గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఈ గాలులతో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో నేడు భారీ వర్షాలతో పాటు రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మరో మూడ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, ఆగ్నేయం నుంచి గాలులు వీస్తున్నాయని... వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
telangana rains