తెలంగాణ

telangana

ETV Bharat / city

బండి సంజయ్ సవాల్​తో పోలీస్ బందోబస్తు - చార్మినార్​కు బండి సంజయ్​

బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయం, చార్మినార్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

heavy number of police at bjp office and charminar for bandi sanjay visit
heavy number of police at bjp office and charminar for bandi sanjay visit

By

Published : Nov 20, 2020, 11:38 AM IST

జీహెచ్​ఎంసీలో వరదసాయాన్ని అడ్డుకోలేదని నిరూపించడానికి చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిపై ఒట్టు వేయడానికి ఇవాళ వెళ్తానని భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించిన దృష్ట్యా... పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చార్మినార్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోలీసులు అడ్డుకుంటారనే ప్రచారం అవాస్తవం

బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయ కార్యక్రమం ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. బండి సంజయ్ ఆలయ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని స్పష్టంచేశారు. పోలీసులు అడ్డుకుంటున్నారనే ప్రచారంలో నిజంలేదన్నారు. ఎవరైనా సరే... మందిర్, మసీద్ గురుద్వారాకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని అంజనీకుమార్‌ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: రేపు చార్మినార్​కి వస్తా.. దమ్ముంటే కేసీఆర్ రావచ్చు: సంజయ్ సవాల్

ABOUT THE AUTHOR

...view details