తెలంగాణ

telangana

ETV Bharat / city

జీడిమెట్ల ఫాక్స్​సాగర్​ చెరువు పరిశీలన - Heavy flood to Jeedimetla fo sagar lake

భారీ వర్షాలతో పూర్తిగా నిండిపోయిన జీడిమెట్ల ఫాక్స్​సాగర్​ చెరువును స్థానిక ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, సైబరాబాద్​ సీపీ సజ్జనార్ పరిశీలించారు. గతంలో మూసిన తూమును తెరిచేందుకు నాగార్జునసాగర్​, శ్రీశైలం డ్యామ్​ నిపుణుల బృందాన్ని పిలిచారు.

Heavy flood to Jeedimetla fo sagar lake
జీడిమెట్ల ఫాక్స్​సాగర్​ చెరువు

By

Published : Oct 20, 2020, 3:18 PM IST

భారీ వర్షాలతో పూర్తిగా నిండిన జీడిమెట్ల ఫాక్స్​సాగర్​ చెరువును స్థానిక ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంభీపూర్​ రాజుతో కలిసి.. సైబరాబాద్​ సీపీ సజ్జనార్ పరిశీలించారు. 37 అడుగుల చెరువు పూర్తి నీటిమట్టానికి ప్రస్తుతం 34 అడుగల మేర నీరు చేరింది.

గతంలో తూము లీకేజీ అవుతుందని దాన్ని పూర్తిగా మూసివేశారు. గతంలో మూసిన తూమును నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్​ నిపుణుల బృందం సాయంతో తెరిచేందుకు యత్నిస్తున్నారు. తూము తెరిస్తే ముంపు ప్రాంతాల వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే వివేక్ సూచించారు. మరో రెండ్రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details