తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ సమస్య ఉంది.. నేను తల్లిని కాగలనా?

హలో డాక్టర్‌. నాకు పుట్టుకతోనే కుడి మూత్రపిండం, కుడివైపు అండాశయం లేవు. పిరియడ్స్‌ కూడా ఇర్రెగ్యులర్‌గా వస్తుంటాయి. డాక్టర్‌ని సంప్రదిస్తే హార్మోన్ల అసమతుల్యత ఉందని చెప్పారు. పదేళ్ల నుంచి మందులు వాడుతున్నాను.. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. నేను తల్లిని కాగలనా? దయచేసి చెప్పండి. - ఓ సోదరి

health-tip-i-have-a-problem-can-i-get-pregnants
ఆ సమస్య ఉంది.. నేను తల్లిని కాగలనా?

By

Published : Jul 2, 2020, 1:06 PM IST

మీకు పుట్టకతోనే ఒకవైపు మూత్రపిండం, అండాశయం లేవు అంటే.. అది జన్మతహా వచ్చిన శారీరక లోపం. సాధారణంగా ఇలా ఒకవైపు అవయవాలు సరిగ్గా ఏర్పడనప్పుడు గర్భాశయం కూడా ఆ వైపు సరిగ్గా ఏర్పడి ఉండదు. ఇటువంటి శారీరక లోపాలున్న వారికి క్రోమోజోముల్లో కూడా లోపాలుండవచ్చు.

అందుకని మీకు ఇప్పటివరకు ఎలాంటి హార్మోన్ల పరీక్షలు జరిగాయో? మీ క్రోమోజోముల పరీక్షలు జరిగాయో, లేవో? మీకు అండాశయం ఒకటే ఉంది కాబట్టి మీకు అండాల నిల్వ ఎంత ఉందో? మీ గర్భాశయం ఎదుగుదల ఏ రకంగా ఉందో.. ఈ వివరాలన్నీ తెలిస్తేనే గానీ మీరు తల్లి కాగలరో, లేదో చెప్పడం కష్టం. అందుకే వీటికి సంబంధించిన మీ వివరాలన్నీ తీసుకొని గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే వారు మీకు సరైన సలహా ఇవ్వగలుగుతారు.

ఇదీ చూడండి:కోదండరాం నిరసన దీక్ష.. ప్రజల బతుకులు కాపాడాలని డిమాండ్

ABOUT THE AUTHOR

...view details