HC on Employees Posting: ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై హైకోర్టు విచారణ చేపట్టింది. విశ్రాంత ఉద్యోగి నాగధర్ సింగ్ వేసిన పిల్.. చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పోస్టింగ్‌లు ఇవ్వకుండా జీతాలు ఇస్తున్నారని పిటిషనర్ వాదించారు. ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేయనందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌పై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.
HC on Employees Posting: 'పోస్టింగులు ఇవ్వకుండా జీతాలు ఇస్తే ప్రజాధనం వృథానే..' - ఉద్యోగులకు పోస్టింగులు
HC on Employees Posting: ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన పలువు ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై విశ్రాంత ఉద్యోగి నాగధర్‌సింగ్ వేసిన పిల్ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిల్‌ను విచారించిన సీజే.. కౌంటర్ దాఖలు చేయకపోవటంపై సీఎస్‌పై అసహనం వ్యక్తం చేశారు.
tshc
కౌంటర్ దాఖలు చేయకపోతే మార్చి 14న వ్యక్తిగతంగా హాజరుకావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. పనిచేయించుకోకుండా జీతాలు ఇస్తే ప్రజాధనం వృథా అయినట్లేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉద్యోగులు వెయిటింగ్‌లో ఎంతమంది ఉన్నారు..? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి..? అన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని సీజే ఆదేశించారు. ఈ పిల్‌పై తదుపరి విచారణ మార్చి 14వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.
ఇదీ చూడండి: