ఐదేళ్లలో రూ.200 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేశానని ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హస్తినాపురం డివిజన్ తెరాస అభ్యర్థి రమావత్ పద్మ నాయక్ తెలిపారు. తాను చేసిన అభివృద్ధి పనులు రోడ్లు, డ్రైనేజ్, పార్కులు వంటివి తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
నేను చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది: పద్మ నాయక్ - జీహెచ్ఎంసీ లేటెస్ట్ అప్డేట్స్ 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా హస్తినాపురం డివిజన్లో తెరాస అభ్యర్థి రమావత్ పద్మానాయక్ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నేను చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది: పద్మ నాయక్
రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్తానని తెలిపారు. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం చేశారు.
ఇదీ చదవండి:స్మార్ట్ కార్డులు నిండుకున్నాయ్...!