"చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. రోజుకు రెండు సార్లు స్నానం చేయండి. పౌష్ఠికాహారం తినండి. వేడి వేడి కోడిగుడ్డు గానీ, మాంసం గానీ, పప్పులు గానీ తినండి. పప్పుల్లోనూ పోషకాలుంటాయి. సి-విటమిన్ ఉండే నిమ్మరసం తాగండి. బత్తాయి, ఆరెంజ్ పండ్లు తినండి. రోజూ మూడు పూటలా వేడి నీరు తాగండి. కరోనా వైరస్ గొంతులో ఉంటుంది. వేడికి వైరస్ చచ్చిపోతది. ఇంట్లో ఉంటే పొద్దుపోతలేదనుకుంటే యోగా చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది. టీవీ పెడితే యోగ ఎలా చేయాలో చెబుతారు."
'పొద్దుపోకుంటే యోగా చేస్కోండి.. ఆరోగ్యానికి మంచిది' - ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిత్యావసరాల పంపిణీ
కరోనా వల్ల పేద, ధనిక అనే తేడా లేకుండా పోయిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహకారంతో ఆటో డ్రైవర్లకు, గ్రామపంచాయతీ సిబ్బందికి నిత్యావసర కిట్లు అందజేశారు. పటాన్చెరులో ఇప్పటికే మూడు పాజిటివ్ కేసులు నమోదైనందున... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయటకు వస్తే మాస్కులు ధరించాలని, వైరస్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు.
'పొద్దుపోకుంటే యోగా చేస్కోండి.. ఆరోగ్యానికి మంచిది'