ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చంద్రాయణగుట్ట సమీపంలోని గుర్రం చెరువు కట్ట తెగి.. భారీగా విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. పాతబస్తీలోని పలు ప్రాంతాలు గుర్రం చెరువు వరద నీటిలో మునిగిపోయాయి.
పూర్తి కావొస్తున్న గుర్రం చెరువు కట్ట నిర్మాణ పనులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన చంద్రాయణగుట్ట గుర్రం చెరువు కట్టను తిరిగి నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దాదాపు పనులు పూర్తి కావచ్చాయి. మరోసారి వరదలు వచ్చినా.. జనావాసాల్లోకి వరద రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పూర్తి కావొస్తున్న గుర్రం చెరువు కట్ట నిర్మాణ పనులు
అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉన్నందున గుర్రం చెరువు కట్టను యుద్ధ ప్రాతిపదికన తిరికి నిర్మిస్తున్నారు. మరోసారి వరద నీరు జనావాసాల్లోకి రాకుండా.. అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 70 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి . మరోసారి గుర్రం చెరువు వల్ల ముప్పు వాటిల్లకుండా కట్ట దృఢంగా నిర్మించినట్టు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:అన్నదాతను ఆదుకోకపోతే దశలవారీ ఉద్యమం: రమణ