తెలంగాణ

telangana

ETV Bharat / city

GroundWater : మేలో భూగర్భజలాలు ఎంత పెరిగాయంటే... - telangana rains

రాష్ట్రంలో గతేడాది మే నెలతో పోలిస్తే..ఈ ఏడాది 2.09 మీటర్ల మేర భూగర్భజలాలు(GroundWater) పెరిగినట్లు రాష్ట్ర భూగర్భ జల శాఖ ప్రకటించింది. సాధారణం కన్నా 46 శాతం అధిక వర్షపాతం నమోదవ్వడమే దీనికి కారణమని వెల్లడించింది.

groundwater, groundwater in telangana, groundwater is increased in telangana
భూగర్భజలాలు, తెలంగాణలో భూగర్భజలాలు, తెలంగాణలో పెరిగిన భూగర్భజలాలు

By

Published : Jun 3, 2021, 8:05 AM IST

మే నెలలో సాధారణం కన్నా 46 శాతం అధికంగా వర్షపాతం నమోదవటం వల్ల రాష్ట్రంలో గతేడాది మే తో పోలిస్తే ఈసారి 2.09 మీ నీటిమట్టం పెరిగినట్లు రాష్ట్ర భూగర్భ జల శాఖ ప్రకటించింది. నెలవారీ భూగర్భజల మట్టాల సర్వేలో ఈ ఏడాది మే నెలలో సరాసరి నీటిమట్టం 9.19 మీటర్లుగా నమోదైనట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు(GroundWater) పెరిగాయని.. భూపాలపల్లి, నిజామాబాద్ వంటి మూడు జిల్లాల్లోనే స్వల్పంగా తగ్గినట్లు పేర్కొంది. ఈ పెరుగుదల ఏప్రిల్ 2021తో పోలిస్తే 0.17 మీటర్లు తగ్గినట్లు వెల్లడించింది.

జగిత్యాల, పడమటి ఆసిఫాబాద్, పడమర, మధ్య -మంచిర్యాల, తూర్పు నిర్మల్, వరంగల్, తూర్పు కరీంనగర్, మహబూబాబాద్, సూర్యాపేట, దక్షిణ, మధ్య నాగర్ కర్నూల్, గద్వాల్ ప్రాంతాల్లో 5 నుంచి పది మీటర్ల లోపు 53 శాతం, పది నుంచి పదిహేను మీటర్ల పరిధిలో 23 శాతం విస్తీర్ణంలో భూగర్భజలాలు విస్తరించి ఉన్నాయి. 15 నుంచి 20 మీటర్ల మట్టంలోపు 7 శాతం భూభూగం, 20 మీటర్ల లోపు 2 శాతం భూగంలో భూగర్భజలాలు విస్తరించి ఉన్నట్లు ఆ శాఖ తెలిపింది. తూర్పు నిజామాబాద్, దక్షిణ, తూర్పు సంగారెడ్డి, దక్షిణ మెదక్, దక్షిణ సిద్ధిపేట, తూర్పు భద్రాద్రి కొత్తగూడెం, మధ్య కామారెడ్డి, పడమర నిర్మల్, ఉత్తర వికారాబాద్ , ఉత్తర, పడమర, తూర్పు మహబూబ్ నగర్ జిల్లాల్లో అతిలోతులో భూగర్భజలాలు గుర్తించినట్లు భూగర్భ జల శాఖ ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details