తెలంగాణ

telangana

ETV Bharat / city

పుట్టినరోజున నిరుపేదలకు నిత్యావసర సరకుల పంపిణీ - lockdown

లాక్​డౌన్​ నేపథ్యంలో అన్నార్తులకు దాతలు తమ సాయం అందిస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆల్విన్​ కాలనీ డివిజన్​ తెరాస అధ్యక్షుడు గణేష్​ తన పుట్టినరోజు సందర్భంగా 400 మంది నిరుపేదలు, వలస కూలీలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

groceries distribution in hyderabad
పుట్టినరోజున నిరుపేదలకు నిత్యావసర సరకులు పంపిణీ

By

Published : Apr 28, 2020, 7:50 PM IST

కరోనా నేపథ్యంలో అన్నార్తులను ఆదుకునేందుకు దాతల సహాయం కొనసాగుతోంది. శేరిలింగంపల్లి నియోజక పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ తెరాస అధ్యక్షుడు గణేష్ తన పుట్టినరోజు ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని సుమారు 400 మంది నిరుపేదలు, వలస కూలీలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా మొగులమ్మ కాలనీలో కూరగాయలు, బియ్యాన్ని అందజేశారు. డివిజన్​లో లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి తమ నాయకులు డివిజన్​లో తోచిన సహాయం అందిస్తున్నారని... ఆకలితో ఇబ్బంది పడుతున్నట్లు ఎవరైనా తమ దృష్టికి తీసుకువస్తే సరకులను అందజేస్తామని తెలిపారు.

ఇవీ చూడండి: వలస కష్టం: కాలి నడకన 2 వేల కి.మీ ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details