ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి శోభానాయుడు అకాల మరణం తీరని లోటని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. కళకు ఎల్లలు లేవని, కళాకారులకు ఆకాశమే హద్దని తెలిపారు. ప్రణవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ నృత్య గురువు పద్మజారెడ్డి.. శోభానాయుడు స్మారక నృత్య పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హాజరయ్యారు. పోటీలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు.
కళాకారులకు ఆకాశమే హద్దు : గ్రేటర్ మేయర్ - Shobhanayudu Memorial Competitions 2021
కళలకు ఎల్లలు లేవని, కళాకారుల కళకు ఆకాశమే హద్దు అని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ప్రణవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభానాయుడు స్మారక పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కళాకారులకు ఆకాశమే హద్దు
నాట్యరంగానికి శోభానాయుడు చేసిన సేవలను కొనియాడారు. తొలి బ్యాచ్ శిష్యురాలిగా.. శోభానాయుడు ఖ్యాతిని శాశ్వతం చేసేందుకు, మున్ముందు తరాలకు గుర్తుచేసేందుకు జూమ్ వేదిక ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కూచిపూడి, భరతనాట్యం పోటీలు నిర్వహించినట్లు పద్మజారెడ్డి తెలిపారు. ఏటా ఈ పోటీలు జరపనున్నట్లు వెల్లడించారు.