కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరావాసంలో భాగంగా వసతుల కల్పనకు నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. గజ్వేల్ మండలం ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌లో... ములుగు మండలం తునికిబొల్లారంలో వసతుల కల్పించనున్నారు. రూ.419 కోట్ల వ్యయంతో వసతుల కల్పనకు పరిపాలన అనుమతులు వచ్చాయి. మల్లన్న సాగర్ కింద నిర్వాసితులయ్యే 5762 కుటుంబాలకు చట్టం ప్రకారం పరిహారం అందించనున్నారు. కొండపోచమ్మ సాగర్ కింద నిర్వాసితులయ్యే 1767 కుటుంబాలకు చట్టం ప్రకారం పరిహారం ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఉత్తర్వులు జారీ చేశారు.
"కాళేశ్వరం" పునరావాసంలో వసతులకు నిధుల మంజూరు
"కాళేశ్వరం" పునరావాసంలో వసతులకు నిధుల మంజూరు
16:05 November 28
"కాళేశ్వరం" పునరావాసంలో వసతులకు నిధుల మంజూరు
Last Updated : Nov 28, 2019, 5:27 PM IST