ఇంజినీర్స్ ఎల్లవేలలా ఆవిష్కరణ, అంకితభావం, అప్డేటెడ్గా ఉంటేనే... సవాళ్లను సమర్థవంతంగా అధిగమించే నైపుణ్యం పెరుగుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. 53వ ఇంజినీర్స్ డే సందర్భంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ చాప్టర్ నిర్వహించిన వెబినార్‌లో గవర్నర్ పాల్గొన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని ఇంజినీర్స్ డేగా జరుపుకోవటం.. దేశానికి అంకితభావంతో వారందంచిన సేవలకు ఇచ్చే గౌరవమని కొనియాడారు.
దేశాభివృద్ధిలో ఇంజినీర్లది కీలక పాత్ర: గవర్నర్ - ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ చాప్టర్
దేశాభివృద్ధిలో ఇంజినీర్లది కీలక పాత్ర అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇంజినీర్స్ డే సందర్భంగా... ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ చాఫ్టర్ నిర్వహించిన వెబినార్‌లో పాల్గొన్నారు.
ఒక ఇంజినీర్ తన కెరీర్, ప్రొఫెషన్లో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుందని గవర్నర్ సూచించారు. ఓ డాక్టర్ తప్పు చేస్తే... ఓ పేషంట్ ప్రాణానికి మాత్రమే ప్రమాదం. కానీ ఒక ఇంజినీర్ తప్పిదంతో చాలా మంది ప్రాణాలకు ముప్పుంటుందన్నారు. 2020 సంవత్సరానికి గానూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డును నిట్ వరంగల్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు, డీఆర్డీఎల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. జోషికి సంయుక్తంగా ప్రకటించారు. ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ గోపాల్ నాయక్, డీఆర్డీవో సైంటిస్ట్ డాక్టర్ కిషోర్ నాథ్, బీహెచ్ఈఎల్ డిప్యూటీ జీఎం డాక్టర్ మోహన్ రావుకు... ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, డాక్టర్ అల్కాకుమారి, డాక్టర్ పవన్‌కు యంగ్ ఇంజినీర్స్ అవార్డులు ప్రకటించారు.
ఇదీ చూడండి:కన్న తండ్రినే దారుణంగా కొట్టి చంపిన కూతురు