నిరుపేదల ఆకలి తీర్చేందుకు 'రాజ్‌భవన్ అన్నం' పేరుతో గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్యం దాదాపు 500 మంది పేదలకు ఉదయం ఉచితంగా టిఫిన్, నామమాత్ర రుసుముతో మధ్యాహ్నం, రాత్రి పూట భోజనం కల్పించనున్నారు.
'రాజ్‌భవన్ అన్నం'.. రేపటి నుంచి శ్రీకారం..
తెలంగాణ గవర్నర్‌గా తమిళి సై సౌందర రాజన్ ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా... 'రాజ్‌భవన్ అన్నం' పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్యం 500 మందికి ఉచితంగా టిఫిన్, నామమాత్ర రుసుముతో మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయాన్ని సోమవారం ఉదయం ప్రారంభించనున్నారు.
'రాజ్‌భవన్ అన్నం'.. పేదలకు ఉచితంగా టిఫిన్
'రాజ్‌భవన్ అన్నం' కార్యక్రమాన్ని సోమవారం ఉదయం ఏడున్నరకు గవర్నర్ దంపతులు రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్లో ప్రారంభించనున్నారు. గవర్నర్‌గా ఏడాది కాలం పూర్తి చేసుకున్న తమిళ సై సౌందర రాజన్ తనదైన ముద్ర వేశారు.
ఇదీ చూడండి:దేశ ఆరోగ్య రంగం పటిష్ఠం: రాష్ట్రపతి