దీపావళి వేడుకలను సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులకు అంకితమిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. దీపావళి, బాలలదినోత్సం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు సైనికులు చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివన్నారు. పండగ సందర్భంగా దుస్తులు, వస్తువులను స్థానిక వ్యాపారుల నుంచి కొనడం ద్వారా వారు ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు.
'దీపావళి వేడుకలను సరిహద్దుల్లోని సైనికులకు అంకితమిస్తున్నా..' - telangana latest news
దీపావళి వేడుకలను సరిహద్దుల్లోని సైనికులకు అంకితమిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. వచ్చే ఏడాది దీపావళి వేడుకలను కొవిడ్ రహిత స్థితిలో నిర్వహించుకుంటామని ఆకాంక్షించారు.
'దీపావళి వేడుకలను సరిహద్దుల్లోని సైనికులకు అంకితమిస్తున్నా..'
కొవిడ్ కారణంగా వేడుకలు గొప్పగా నిర్వహించుకోనప్పటికీ... వేడుక స్ఫూర్తి ఎక్కువగానే ఉందన్నారు. దీపావళి సందర్భంగా అమెరికాలోని వైట్‌హౌస్‌తో పాటు వివిధ దేశాల్లోని పార్లమెంట్ భవనాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారని చెప్పారు. వచ్చే ఏడాది దీపావళి వేడుకలను కొవిడ్ రహిత స్థితిలో నిర్వహించుకుంటామని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు.