రాజ్‌భవన్ మహిళల కోసం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రాజ్ భవన్ ఉద్యోగుల ఆరోగ్యం కోసం యోగా సహా పలు కార్యక్రమాలు చేపట్టిన గవర్నర్... ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు. మహిళలకు వివిధ రకాల చేతి వృత్తుల్లో శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టారు.
రాజ్ భవన్ మహిళలకు చేతి వృత్తుల్లో శిక్షణ
రాజ్‌భవన్ మహిళల సెల్ఫ్ ఎంప్లాయిమెంట్‌ను గవర్నర్ తమిళిసై ప్రోత్సహిస్తున్నారు. వివిధ రకాల చేతి వృత్తుల్లో శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టారు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగుల తయారీ, పేపర్‌తో కళాకృతుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు.
governor tamilisai
కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగుల తయారీ, పేపర్‌తో కళాకృతుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ కమ్యునిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ పాల్గొని ... మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఎలీప్ వారి సహకారంతో నిర్వహించనున్న ఈ శిక్షణలో పాల్గొనే మహిళలు... తప్పక కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని గవర్నర్ కోరారు.
ఇదీ చదవండి :టీఎస్ బీపాస్ అమలుకు త్వరలో కార్యాచరణ: కేటీఆర్