ESMA : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెదిశగా అడుగులు వేస్తుండటంతో.. ఎస్మా చట్టం ప్రయోగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ప్రత్యేకించి అత్యవసర సర్వీసులుగా పరిగణించే ఆర్టీసీ, విద్యుత్, వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు.. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు అందించే సేవల్లో అంతరాయం లేకుండా చూసేందుకు ఎస్మా చట్టం ప్రయోగించటం ఒక్కటే పరిష్కారమని.. ప్రభుత్వం భావిస్తోంది. ఓ వైపు చర్చల కోసం ప్రయత్నాలు చేస్తూనే దీనిపైనా కసరత్తు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఏయే శాఖల్లోని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించవచ్చనే అంశంపై శాఖల వారీగా జాబితాను సిద్దం చేస్తున్నారు.
సమ్మెకు వెళ్లటానికి నోటీసు అవసరం లేదు..