Kokapeta Neapolis lands: కోకాపేట నియోపోలిస్ భూములు అమ్మేందుకు లైన్ క్లియర్.. - lands selling in kokapet
14:51 December 22
Kokapeta Neapolis lands: కోకాపేట నియోపోలిస్ భూములు అమ్మేందుకు లైన్ క్లియర్..
Kokapeta Neapolis lands: కోకాపేట నియోపోలిస్ భూముల అమ్మకానికి ఎట్టకేలకు లైన్‌క్లియరైంది. భూములు అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 239, 240 సర్వే నంబర్లలోని భూమిపై పూర్తి హక్కులు ప్రభుత్వానివేనని సర్కారు స్పష్టం చేసింది. భూముల విక్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఏజెంటుగా హెచ్ఎండీఏ ఈ-వేలం నిర్వహించిందని పేర్కొంది. వేలాన్ని పూర్తి చేసి వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసినట్లు తెలిపింది.
వేలంలో భూములు దక్కించుకున్నవారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని రంగారెడ్డి కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి:
- Kokapet Land Issue in assembly: కోకాపేట భూముల వేలంపై సీబీఐ విచారణకు మరోసారి కాంగ్రెస్ డిమాండ్