తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ఏపీ ప్రభుత్వం లీవ్‌ పిటిషన్ ‌ - తెలంగాణ వార్తలు

ఏబీ వెంకటేశ్వరరావు కేసులో భాగంగా ఏపీ ప్రభుత్వం లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు వినిపిస్తామని పేర్కొంది. రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అనిశా ఆయనపై గతంలో కేసు నమోదు చేసింది.

ap high court, ab venkateswara rao case
ఏబీ వెంకటేశ్వరరావు కేసులో లీవ్ పిటిషన్, ఏపీ హైకోర్టు తాజా వార్తలు

By

Published : Apr 19, 2021, 5:27 PM IST

ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టులో లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఏబీ కేసులో వాదనలు వినిపిస్తామని పిటిషన్​లో పేర్కొంది.

రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అనిశా ఆయనపై గతంలో కేసు నమోదు చేసింది. కేసు నమోదుకు ముందే ఏబీ వెంకటేశ్వరరావు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఏబీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలిస్తూ... మార్చి 8న తీర్పు రిజర్వ్ చేసింది. దర్యాప్తులో హైకోర్టుల జోక్యం తగదన్న సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ... వైకాపా ప్రభుత్వం ఇవాళ పిటిషన్ దాఖలుచేసింది. కేసులో తమ వాదనలు వినాలని పిటిషన్​లో ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

ఇదీచదవండి: 'జగన్ కుటుంబసభ్యుల అరెస్టుకు ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఒత్తిడి'

ABOUT THE AUTHOR

...view details