ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తోన్న వర్షాలకు వరద నీరు నదికి పోటెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటిమట్టం 17.90 అడుగులకు చేరింది. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి దాదాపు 19.21 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
జలదిగ్బంధంలో గ్రామాలు
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో గోదావరి వరద ఉద్ధృతికి.. దాదాపు 36 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దేవీపట్నం, పూడిపల్లి, పోచమ్మగండి, పొయ్యేరు, అగ్రహారం గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొనసీమలోనూ వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. దాదాపు 21 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏడేళ్ల తర్వాత మళ్లీ