తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రేమోన్మాదం: స్నేహితురాలినే హతమార్చిన ఉన్మాది - girl murder at varasiguda

సంచలనం సృష్టించిన ఇంటర్‌ విద్యార్థిని హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వివాహానికి అంగీకరించకుండా... దూరం ఉంచుతోందని... ప్రియురాలిపై పగ పెంచుకున్న ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టినట్టు దర్యాప్తులో తేలింది. ఆమెపై రాయితో దాడి చేసి గొంతు కోసి దారుణంగా అంతమొందించాడు. ఉన్మాదిని పోలీసులు అరెస్టు చేశారు.

స్నేహితురాలిని హతమార్చిన ప్రేమ
స్నేహితురాలిని హతమార్చిన ప్రేమ

By

Published : Jan 25, 2020, 5:10 AM IST

సికింద్రాబాద్‌ చిలకలగూడ ప్రాంతంలో ఓ ఉన్మాది ఇంటర్‌ విద్యార్థినిని దారుణంగా హత్య చేశాడు. గొంతుకోసి భవనంపై నుంచి కిందకు పడేశాడు. వారసిగూడకు చెందిన నిందితుడు షోయబ్‌కు... ఇంటర్‌ విద్యార్థినికి బాల్య స్నేహితుడు. తొమ్మిదో తరగతివరకు కలిసే చదువుకున్నారు. విద్యార్థినిని పెళ్లి చేసుకునేందుకు షోయబ్‌ ప్రయత్నాలు చేయగా బాలిక తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న షోయబ్‌ ఏ విధంగానైనా అంతం చేయాలని పథకం వేశాడు. గురువారం రాత్రి బాలికను ఇంటి డాబా పైకి పిలిచి కిరాతకంగా రాయితో గొంతుకోసి, దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను భవనం పైనుంచి తోసి వేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు అనంతరం ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయాడు. పోలీసుల విచారణలో హత్య విషయం బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

స్నేహితురాలిని హతమార్చిన ప్రేమ

ABOUT THE AUTHOR

...view details