ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాలలో నాగేంద్ర అనే యువకుడిపై ఓ యువతి యాసిడ్‌తో దాడి చేసింది.
యువకుడిపై యాసిడ్‌తో దాడిచేసిన యువతి - యువకుడిపై యాసిడ్ దాడి
10:08 September 04
యువకుడిపై యాసిడ్‌తో దాడి చేసిన యువతి
పెద్దకొట్టాల చెందిన ఓ యువతి, నాగేంద్ర ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించి.. విరమించుకున్నారు. నాగేంద్ర ఇటీవల మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమించిన యువతి.. నాగేంద్రపై యాసిడ్ దాడి చేసింది. బాధితుడు ప్రస్తుతం.. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వారం రోజుల కిందటే నాగేంద్రపై ఆ యువతి యాసిడ్ దాడికి పాల్పడింది. ఆ గాయాలు మానక ముందే మరోసారి దాడి చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవీచూడండి:దారుణం: ఆడపిల్లలు పుట్టారని పురుగులమందు తాగించిన తండ్రి