నిబంధనల ప్రకారం సకాలంలో పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు పంపి తక్షణమే వాటిని రద్దు చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులను ఆదేశించారు. మేయర్ అధ్యక్షతన సమవేశమైన జీహెచ్ఎంసీ స్టాండిగ్ కమిటీ... పలు అంశలపై కూలంకషంగా చర్చించింది. సకాలంలో పనులు ప్రారంభించని కాంట్రక్టుల రద్దు సహా... ఆయా కంపనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని మేయర్ సూచించారు.
'సకాలంలో పనులు ప్రారంభించని కాంట్రాక్టులను రద్దు చేయండి' - ghmc meeting
మేయర్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. పలు అంశలపై కూలంకషంగా చర్చించింది. సకాలంలో పనులు ప్రారంభించని కాంట్రక్టుల రద్దు సహా... ఆయా కంపనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని మేయర్ సూచించారు.
'సకాలంలో పనులు ప్రారంభించని కాంట్రాక్టులను రద్దు చేయండి'
అవసరమైతే వారి ఇఎండీని కూడా స్వాదీనం చేసుకోవాలని రామ్మోహన్ తెలిపారు. దీని వల్ల నిర్లక్ష్యంగా ఉన్న కాంట్రాక్టు కంపనీలు భవిష్యత్తులో వేరే పనులు చేపట్టేందుకు అవకాశం ఉండదన్నారు. నిబద్ధతో పనులు చేసే వారికే కాంట్రాక్టులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.