హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో జీహెచ్ఎంసీకి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. బుధవారం రాత్రి 9 గంటల వరకు నగర వాసుల నుంచి మొత్తం 1,531 ఫిర్యాదులు వచ్చాయి. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్, వెబ్సైట్, డయల్ 100, మై జీహెచ్ఎంసీ యాప్‌కు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి.
భారీ వర్షాలతో జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ - hyderabad rain complaints
భారీ వర్షాలతో నగరం అతలాకుతలం అవడం వల్ల బుధవారం.. జీహెచ్ఎంసీకి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా నీరు నిలిచిన ప్రదేశాల నుంచి 717, మొత్తం 1,531 ఫిర్యాదులు అందాయని అధికారులు పేర్కొన్నారు.
భారీ వర్షాలతో జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ
అత్యధికంగా నీరు నిలిచిన ప్రదేశాల నుంచి 717, డ్రైనేజి ఓవర్ ఫ్లో పై 382 ఫిర్యాదులు వచ్చాయి. చెట్లు విరిగాయని 266 ఫిర్యాదులు అందినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ఫిర్యాదులు అందిన వెంటనే పరిష్కరిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.