తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే కేటీఆర్​కు బహుమతి: మేయర్ బొంతు - గిఫ్ట్ ఏ స్మైల్

కరోనా కట్టడికి జీహెచ్​ఎంసీ కృతనిశ్చయంతో ముందుకెళ్తుందని... ఒకటి రెండు ఘటనలతో విమర్శించడం తగదని హైదరాబాద్‌ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఈ నెల 24న కేటీఆర్ జన్మదినం సందర్భంగా వినూత్న పద్ధతిలో 'గిఫ్ట్​ ఏ స్మైల్' కార్యక్రమం... ప్రణాళిక చేశామంటున్న బొంతు రామ్మోహన్​తో మా ప్రతినిధి నగేష్ చారి ముఖాముఖి.

ghmc mayor interview with etv bharat on ktr birthday celebrations
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే కేటీఆర్​కు బహుమతి: మేయర్ బొంతు

By

Published : Jul 22, 2020, 4:44 AM IST

ఈ నెల 24న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు 'గిఫ్ట్ ఏ స్మైల్' పేరుతో వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. బొకేలు, శాలువాలు, హోర్డింగుల కోసం ఖర్చు చేయకుండా... ఆపదలో ఉన్న వారికి సాయం చేసి వారి చిరునవ్వులు కేటీఆర్​కు కానుకగా ఇవ్వాలన్నారు. వస్తు, ధన రూపాల్లో కానీ.. ఏదైనా ఇతర రూపాల్లో వ్యక్తిగత, సామాజిక అవసరాలను తీర్చి... ఫోటోలు, వివరాలు కేటీఆర్ ట్విట్టర్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రాం, ఇతర సామాజిక మాధ్యమాల్లా ట్యాగ్ చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని తెరాస శ్రేణుల్లో ఉత్సాహం ఉన్నప్పటికీ... కరోనా పరిస్థితుల కారణంగా నిరాడంబరంగా జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే కేటీఆర్​కు బహుమతి: మేయర్ బొంతు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details