హైదరాబాద్ నుంచి ప్రార్థనలకు దిల్లీకి వెళ్లొచ్చిన వారిలో సుమారు 80 శాతం మందిని గుర్తించామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. మిగిలిన వారు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీధి కుక్కలకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సుమారు 1500 మంది యాచకులను వసతి, భోజనం ఏర్పాటుచేశామంటున్న మేయర్ బొంతు రామ్మోహన్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'మర్కజ్ యాత్రికులు స్వచ్ఛందంగా పరీక్ష చేయించుకోవాలి' - bontu ram mohan news
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న తరుణంలో మర్కజ్ యాత్రికులకు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఇప్పటికే 80 శాతం మంది యాత్రికులను గుర్తించామని.. మిగిలిన వారు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
'మర్కజ్‌కు యాత్రికులు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి'