హైదరాబాద్‌లోని జీడీమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు నిండి దిగువ ప్రాంతమైన సుభాష్‌నగర్‌కు అలుగు నీరు భారీగా వస్తుండడంతో జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ సర్కిల్ మున్సిపల్ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
'భారీ వర్షాల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి' - hyderabad rain updates
ఒకటి రెండ్రోజుల్లో భారీ వర్షాలు ఉన్నందున సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సుభాష్‌నగర్ ప్రజలకు జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ సర్కిల్ మున్సిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గాంధీనగర్ కమ్యూనిటీ హాల్‌కు అయినా వెళ్లొచ్చని సూచించారు.
'భారీ వర్షాల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి'
రానున్న 24 గంటల నుంచి 48 గంటల వరకు భారీ వర్షాల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గాంధీనగర్ కమ్యూనిటీ హాల్‌కు వెళ్లాలని మైక్ ద్వారా సందేశం అందించారు.
ఇదీ చూడండి: భారీ వర్షం కురిసిన.. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా..