తెలంగాణ

telangana

ETV Bharat / city

లైవ్ అప్​డేట్స్ : ముగిసిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌

ghmc election polling
బల్దియా ఎన్నికల పోలింగ్

By

Published : Dec 1, 2020, 6:30 AM IST

Updated : Dec 1, 2020, 7:57 PM IST

19:55 December 01

ఎస్​ఈసీని కలిసిన షేక్‌పేట కాంగ్రెస్ అభ్యర్థి నిజాముద్దీన్

  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధిని కలిసిన షేక్‌పేట కాంగ్రెస్ అభ్యర్థి నిజాముద్దీన్
  • షేక్‌పేట డివిజన్‌లోని 20 పోలింగ్ కేంద్రాల్లో మజ్లిస్ నేతలు రిగ్గింగ్ చేశారని ఫిర్యాదు

19:41 December 01

బాగ్‌అంబర్‌పేటలో అత్యధికంగా, జహానుమాలో అత్యల్పంగా పోలింగ్‌ నమోదు

  • బాగ్‌అంబర్‌పేటలో అత్యధికంగా, జహానుమాలో అత్యల్పంగా పోలింగ్‌ నమోదు

19:40 December 01

ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: కేటీఆర్‌

  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: కేటీఆర్‌
  • పార్టీ గెలుపు కోసం కృషిచేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు: కేటీఆర్‌

19:40 December 01

కోహెడ తహసీల్దార్ జానకిని సస్పెండ్‌ చేసిన సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి

  • సిద్దిపేట: కోహెడ తహసీల్దార్ జానకిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి
  • విధులకు గైర్హాజరవడంతో తహసీల్దార్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్
  • నారాయణరావుపేట తహసీల్దార్‌గానూ అదనపు విధులు నిర్వహిస్తున్న జానకి

18:36 December 01

గ్రేటర్‌లో సాయంత్రం 5 వరకు 36.76 శాతం పోలింగ్‌

  • గ్రేటర్‌లో సాయంత్రం 5 వరకు 36.76 శాతం పోలింగ్‌: జీహెచ్‌ఎంసీ
  • పోలింగ్‌ వివరాలు వెల్లడించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్‌

18:35 December 01

రాజేంద్రనగర్‌ డివిజన్‌ ఉప్పర్‌పల్లిలో ఆందోళన

  • హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ డివిజన్‌ ఉప్పర్‌పల్లిలో ఆందోళన
  • ఉప్పర్‌పల్లిలోని 24వ పోలింగ్‌ కేంద్రం వద్ద తెరాస నాయకుల ఆందోళన
  • అమెరికాలో ఉన్న వ్యక్తి పేరిట ఓటు నమోదైనట్లు తెరాస నాయకుల ఆరోపణ
  • రీపోలింగ్‌ నిర్వహించాలని తెరాస నాయకుల ఆందోళన
  • ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు

17:48 December 01

ముగిసిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌

  • ముగిసిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌
  • సాయంత్రం 6 వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం
  • చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌
  • గ్రేటర్‌ పరిధిలోని 149 డివిజన్లలో ముగిసిన పోలింగ్‌
  • ఓల్డ్‌ మలక్‌పేటలో గుర్తుల తారుమారుతో పోలింగ్‌ రద్దు
  • ఎల్లుండి ఓల్డ్‌ మలక్‌పేటలో రీపోలింగ్ నిర్వహణ
  • రీపోలింగ్ దృష్ట్యా ఎల్లుండి సా.6 గంటల వరకు ఎగ్జిట్‌పోల్స్ వెల్లడి నిషేధం
  • డిసెంబర్‌ 4న గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • నగరంతో పోలిస్తే శివారుల్లో ఎక్కువగా నమోదైన పోలింగ్‌ 
  • ఆర్‌.సి.పురం-పటాన్‌చెరు, అంబర్‌పేట సర్కిళ్లలో అత్యధికంగా నమోదైన పోలింగ్‌
  • మలక్‌పేట, కార్వాన్‌ సర్కిళ్లలో అత్యల్పంగా నమోదైన పోలింగ్‌
  • బల్దియా పోలింగ్‌పై వరుస సెలవుల ప్రభావం
  • 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్‌ నమోదు

17:24 December 01

కాసేపట్లో ముగియనున్న గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌

  • కాసేపట్లో ముగియనున్న గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌
  • గ్రేటర్‌లో మధ్యాహ్నం 3 వరకు 29.76 శాతం పోలింగ్‌ నమోదు
  • మధ్యాహ్నం 3 వరకు బాగ్‌ అంబర్‌పేటలో అత్యధికంగా 64.79 శాతం పోలింగ్‌
  • మధ్యాహ్నం 3 వరకు లంగర్‌హౌస్‌లో అత్యల్పంగా 6.77 శాతం పోలింగ్‌
  • సాయంత్రం 6 గంటలకు ముగియనున్న బల్దియా పోలింగ్‌
  • సాయంత్రం 6 వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం

17:09 December 01

షేక్‌పేటలో ఎంఐఎం, భాజపా వర్గీయుల మధ్య ఘర్షణ

  • హైదరాబాద్‌: షేక్‌పేటలో ఎంఐఎం, భాజపా వర్గీయుల మధ్య ఘర్షణ
  • భాజపా కార్యకర్తలకు స్వల్ప గాయాలు
  • ఎంఐఎం నాయకులు రిగ్గింగ్‌ చేస్తున్నారని తెరాస నేతల ఆరోపణ

17:02 December 01

ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఓటు వేసిన జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ కుమారుడు

మెల్​బెర్న్ నుంచి వచ్చి ఓటేసిన కుర్రాడు
  • ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఓటు వేసిన జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ కుమారుడు
  • ఓటు వేసిన జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ శంకరయ్య కుమారుడు రిత్విక్‌
  • ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న రిత్విక్‌
  • జనవరి రెండో వారం రావాల్సి ఉండగా ఓటు కోసం ముందే వచ్చిన రిత్విక్‌
  • కుటుంబ సభ్యులతో కలిసి పేట్‌బషీరాబాద్‌లో ఓటు వేసిన రిత్విక్‌

16:51 December 01

మల్లాపూర్ డివిజన్ శ్రీనివాస్ మోడల్ స్కూల్ వద్ద ఆందోళన

  • హైదరాబాద్‌: మల్లాపూర్ డివిజన్ శ్రీనివాస్ మోడల్ స్కూల్ వద్ద ఆందోళన
  • ఆందోళనకు దిగిన భాజపా, సీపీఐ, తెదేపా నాయకులు
  • 22, 23, 24, 25 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్‌
  • ఉదయం నుంచి రిటర్నింగ్ అధికారి అందుబాటులో లేరని ప్రతిపక్షాల ఆరోపణ

16:47 December 01

గుడిమల్కాపూర్ ఎంఎన్‌ఆర్‌ పాఠశాల వద్ద ఘర్షణ

  • హైదరాబాద్‌: గుడిమల్కాపూర్ ఎంఎన్‌ఆర్‌ పాఠశాల వద్ద ఘర్షణ
  • భాజపాకు చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ, పరస్పర దాడులు
  • ఆందోళనకారులను టపాచబుత్రా పోలీస్‌స్టేషన్‌కు తరలింపు

16:46 December 01

వనస్థలిపురం డివిజన్ 44వ పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన

  • హైదరాబాద్: వనస్థలిపురం డివిజన్ 44వ పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన
  • ఓటరు స్లిప్పులో తెరాసకు ఓటు వేయాలని ఉందని భాజపా అభ్యర్థి ఆరోపణ

16:42 December 01

జాంబాగ్ డివిజన్ జూబ్లీ హైస్కూల్‌ వద్ద ఉద్రిక్తత

  • హైదరాబాద్‌: జాంబాగ్ డివిజన్ జూబ్లీ హైస్కూల్‌ వద్ద ఉద్రిక్తత
  • ఎంఐఎం నాయకులు రిగ్గింగ్‌ చేస్తున్నారంటూ తెరాస నేతల ఆందోళన

16:36 December 01

మధ్యాహ్నం 3 గంటల వరకు లంగర్‌హౌస్‌లో అత్యల్పంగా 7.64 శాతం పోలింగ్‌

  • మధ్యాహ్నం 3 గంటల వరకు బాగ్‌ అంబర్‌పేటలో అత్యధికంగా 64.79 శాతం పోలింగ్‌
  • లంగర్‌హౌస్‌లో అత్యల్పంగా 7.64 శాతం పోలింగ్‌
  • సాయంత్రం 6 గంటలకు ముగియనున్న బల్దియా పోలింగ్‌
  • సాయంత్రం 6 వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం

16:35 December 01

ఘాన్సీబజార్ మోతీ గల్లీ వద్ద తోపులాట

  • హైదరాబాద్‌: ఘాన్సీబజార్ మోతీ గల్లీ వద్ద తోపులాట
  • సెట్విన్ పోలింగ్ కేంద్రం వద్ద ఎంఐఎం, భాజపా వర్గీయుల తోపులాట
  • పోలీసుల రాకతో ఘటనాస్థలి నుంచి వెళ్లిపోయిన ఇరువర్గాలు

16:24 December 01

గాజులరామారంలో ఉద్రిక్తత

  • గాజులరామారంలో ఉద్రిక్తత
  • కాంగ్రెస్ తరఫున దొంగ ఓట్లు వేశారని తెరాస అభ్యర్థి ఆరోపణ
  • కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

16:12 December 01

జూబ్లీహిల్స్ ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేసిన జీవిత, రాజశేఖర్‌

ఓటేసిన జీవిత, రాజశేఖర్
  • జూబ్లీహిల్స్ ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేసిన జీవిత, రాజశేఖర్‌

16:09 December 01

మల్లాపూర్‌ డివిజన్‌లో భాజపా, కాంగ్రెస్‌, సీపీఐ నేతల ఆందోళన

  • మల్లాపూర్‌ డివిజన్‌లో భాజపా, కాంగ్రెస్‌, సీపీఐ నేతల ఆందోళన
  • తెరాస నేతలు ఓటరు స్లిప్పులతో పాటు కారు గుర్తు చీటీలు పంచుతున్నారని ఆరోపణ

15:16 December 01

బాగ్‌ అంబర్‌పేటలో అత్యధికంగా 64.79 శాతం పోలింగ్‌

  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 వరకు 29.76 శాతం పోలింగ్‌
  • మ.3 వరకు బాగ్‌ అంబర్‌పేటలో అత్యధికంగా 64.79 శాతం పోలింగ్‌
  • మధ్యాహ్నం 3 వరకు నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు
  1. రాజేంద్రనగర్- 24.62
  2. చార్మినార్‌- 24.23
  3. సంతోశ్​‌నగర్‌- 17.26
  4. మలక్‌పేట– 15.88
  5. చాంద్రాయణగుట్ట– 15.19
  6. ఫలక్‌నుమా- 17.61
  7. మాదాపూర్‌- 22.70
  8. మియాపూర్‌- 25.47
  9. హఫీజ్‌పేట- 20.98
  10. చందానగర్-‌ 21.42
  11. కొండాపూర్‌- 19.64
  12. గచ్చిబౌలి- 26.56
  13. శేరిలింగంపల్లి- 23.24
  14. సరూర్‌నగర్‌- 27
  15. ఆర్కే పురం- 19.96
  16. సైదాబాద్‌- 16.69
  17. మూసారంబాగ్‌- 17.92
  18. అక్బర్‌బాగ్‌- 18.24
  19. అజంపురా- 12.71
  20. ఛావునీ- 12.29
  21. డబీర్‌పురా- 17.46
  22. బేగంబజార్‌- 28.6
  23. గోషామహల్-‌ 16
  24. మంగళ్‌హాట్-‌ 19.8
  25. దత్తాత్రేయనగర్-‌ 41.4
  26. జాంబాగ్‌- 34.4
  27. గన్‌ఫౌండ్రీ- 35.3
  28. ఖైరతాబాద్-‌ 30.40
  29. సోమాజిగూడ- 24.64
  30. మీర్‌పేట- 27.10
  31. సనత్‌నగర్-‌ 31.50


 

15:11 December 01

రాంనగర్‌లో తెరాస-భాజపా వర్గీయుల బాహాబాహీ

  • అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్‌లో తెరాస-భాజపా వర్గీయుల బాహాబాహీ
  • పోలీసుల సమక్షంలోనే ఘర్షణకు దిగిన తెరాస, భాజపా నాయకులు

15:05 December 01

ఒంటి గంట వరకు 5 శాతం కంటే తక్కువ పోలింగ్‌ నమోదైన డివిజన్లు

ఒంటి గంట వరకు 5 శాతం కంటే తక్కువ పోలింగ్‌ నమోదైన డివిజన్లు-14

పోలింగ్ శాతాలు: 

  1. రెయిన్‌బజార్‌- 0.56
  2. తలాబ్‌చంచలం- 0.74
  3. అమీర్‌పేట- 0.79
  4. కంచన్‌బాగ్- 2.13
  5. షేక్‌పేట- 2.62
  6. సోమాజిగూడ- 2.77
  7. శాలిబండ- 3.85
  8. అత్తాపూర్-‌ 3.85
  9. బేగంబజార్-‌ 3.85
  10. జియాగూడ- 3.85
  11. కార్వాన్-‌ 3.85
  12. ఆల్విన్‌ కాలనీ- 3.85
  13. సుభాశ్​‌నగర్-‌ 3.85
  14. జంగంమెట్‌- 4.91

14:53 December 01

డివిజన్ల వారీగా పోలింగ్‌ శాతం వివరాలు

ఒంటి గంట వరకు 40 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైన డివిజన్లు-10

  • 40 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైన డివిజన్లు:
  1. గుడిమల్కాపూర్‌- 49.19
  2. జగద్గిరిగుట్ట – 42.94
  3. అల్లాపూర్‌ - 42.74
  4. పటాన్‌చెరు - 42.64
  5. భారతీనగర్‌ - 42.34
  6. దత్తాత్రేయ నగర్‌ - 40.86
  7. ఆర్‌.సి.పురం - 40.64
  8. మూసాపేట – 40.44
  9. చిల్కానగర్‌ - 40.23
  10. హస్తినాపురం - 40.15

14:49 December 01

నాచారంలో కాంగ్రెస్‌, తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ

  • నాచారంలో కాంగ్రెస్‌, తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ
  • తమ అభ్యర్థి ఇంటిపై కాంగ్రెస్‌ వర్గీయులు దాడి చేశారని తెరాస ఆరోపణ
  • ఇరు వర్గాల మధ్య తోపులాట, చెదరగొట్టిన పోలీసులు

14:45 December 01

రాష్ట్ర ఎన్నికల సంఘానికి భాజపా నేతల ఫిర్యాదు

  • రాష్ట్ర ఎన్నికల సంఘానికి భాజపా నేతల ఫిర్యాదు
  • బ్యాలెట్‌ పత్రాలపై కారు గుర్తును ప్రత్యేకంగా ముద్రించారని ఫిర్యాదు
  • ఎస్‌ఈసీకి లేఖ రాసిన భాజపా నేత ప్రేమేందర్‌రెడ్డి
  • రెండు డివిజన్లలో బ్యాలెట్‌ పత్రాలపై కారు గుర్తు పెద్దగా ఉందని ఫిర్యాదు
  • గడ్డి అన్నారం, ఏఎస్‌రావు నగర్‌ డివిజన్లలో రీపోలింగ్‌ జరపాలని డిమాండ్‌

14:26 December 01

  • మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్ శాతం 

1.బోరబండ డివిజన్ 31.76 

2. ఫతేనగర్ 28

3.అల్లాపూర్ 18% 

4.అమీర్పేట 21.71

5.సనత్ నగర్ 21.80

6.రహ్మత్ నగర్ 29.72

7.ఎర్రగడ్డ 27.72

8.వెంగళ్​రావు నగర్ డివిజన్ 26.09

14:22 December 01

పటాన్‌చెరులో మధ్యాహ్నం1 గంట వరకు 37.78 శాతం పోలింగ్

బల్దియా పోలింగ్​పై కరోనా ప్రభావం

మధ్యాహ్నం ఒంటి గంట దాటినా మందకొడిగా పోలింగ్

పటాన్‌చెరు సర్కిల్‌ పరిధిలో మ.ఒంటి గంట వరకు 37.78 శాతం పోలింగ్‌ నమోదు

13:59 December 01

  • జియాగూడలో ఓట్ల గల్లంతుపై జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం వివరణ

జియాగూడ 38వ పోలింగ్ కేంద్రంలో మొత్తం 914 ఓట్లు: అధికారులు

268 మినహా మిగిలిన ఓట్లను 29, 30, 31 పోలింగ్ కేంద్రాలకు బదిలీ చేశాం: అధికారులు

జియాగూడ విద్యాశ్రీ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓట్లు ఉన్నాయి: అధికారులు

జియాగూడలో ఓట్లు గల్లంతయ్యాయన్న ప్రచారంలో నిజంలేదు: అధికారులు

జియాగూడ 38వ పోలింగ్ కేంద్రంలో మొత్తం 914 ఓట్లు: అధికారులు

268 మినహా మిగిలిన ఓట్లను 29, 30, 31 పోలింగ్ కేంద్రాలకు బదిలీ చేశాం: అధికారులు

జియాగూడ విద్యాశ్రీ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓట్లు ఉన్నాయి: అధికారులు

జియాగూడలో ఓట్లు గల్లంతయ్యాయన్న ప్రచారంలో నిజంలేదు: అధికారులు

13:54 December 01

  • గ్రేటర్‌లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది: ఎస్ఈసీ

కొవిడ్ ప్రభావం వల్ల ఓటింగ్ కొంత మేర తగ్గినట్లు కనిపిస్తోంది: ఎస్ఈసీ

మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది: ఎస్ఈసీ

శాంతిభద్రతలు, ఇతర ఫిర్యాదుల్లో అవాస్తవాలే ఎక్కువగా ఉన్నాయి: ఎస్ఈసీ

పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు: ఎస్ఈసీ పార్థసారథి

చిన్నచిన్న గొడవలు మినహా ఎక్కడా ఎలాంటి ఘర్షణలు, వివాదాలు లేవు: ఎస్ఈసీ

ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించొద్దు: ఎస్ఈసీ

ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో ఎవరూ ప్రచారం చేయరాదు: ఎస్ఈసీ పార్థసారథి

13:48 December 01

  • గుడిమల్కాపూర్‌ డివిజన్‌లో అత్యధికంగా 49.19 శాతం పోలింగ్ నమోదు

మధ్యాహ్నం ఒంటిగంట వరకు గుడిమల్కాపూర్‌లో 49.19 శాతం పోలింగ్

అత్యల్పంగా రెయిన్‌బజార్‌ డివిజన్‌లో 0.56 శాతం పోలింగ్ నమోదు

తలాబ్ చంచలం డివిజన్‌లో కేవలం 0.74 శాతం పోలింగ్ నమోదు

13:47 December 01

  • ఉప్పల్‌ డివిజన్‌లోని 25వ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

కాంగ్రెస్‌ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ తెరాస, భాజపా ఆరోపణ

పోలీసులకు ఫిర్యాదు చేసిన తెరాస, భాజపా నేతలు

ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

13:45 December 01

  • జీడిమెట్ల డివిజన్‌లో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ

తోపులాటలో భాజపా కార్యకర్తకు గాయాలు, పోలీసులకు ఫిర్యాదు

13:14 December 01

ఓటేసిన మాజీ ఎంపీ విజయశాంతి

జీహెచ్​ఎంసీ పోలింగ్​లో పాల్గొన్న మాజీ ఎంపీ విజయశాంతి

బంజారాహిల్స్​ రోడ్ నంబర్ 12లో ఓటు వేసిన విజయశాంతి

13:10 December 01

ఒంటిగంట వరకు 18.20 శాతం పోలింగ్ నమోదు

మందకొడిగా సాగుతున్న బల్దియా పోలింగ్

మధ్యాహ్నమైనా బయటకు రాని ఓటర్లు

మధ్యాహ్నం ఒంటిగంట వరకు 18.20 శాతం పోలింగ్ నమోదు

13:02 December 01

ఎల్లుండి ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు రీపోలింగ్

ఎల్లుండి ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు రీపోలింగ్
రిటర్నింగ్ అధికారిని మార్చాలని ఎస్ఈసీ ఆదేశాలు
రీపోలింగ్‌లో ఎడమచేతి మధ్య వెలికి సిరా వేయాలని ఆదేశాలు
రీపోలింగ్ దృష్ట్యా ఎల్లుండి సా.6 గంటల వరకు ఎగ్జిట్‌పోల్స్ వెల్లడి నిషేధం

12:51 December 01

బల్దియా పోలింగ్​లో సినీ ప్రముఖులు..

ఫిలింకల్చరల్​ సెంటర్​లో ఓటేసిన సినీ ప్రముఖులు

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నిర్మాత అశ్వినీదత్

ఓటేసిన దర్శకుడు మెహర్ రమేశ్

బల్దియా పోలింగ్​లో పాల్గొన్న విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు

12:44 December 01

  • ఓటమి భయంతోనే దాడులు : తెరాస ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్​పల్లిలో గొడవ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణారావు

ఓటమి భయంతోనే భాజపా నేతలు తమ కాన్వాయ్​పై దాడి చేశారని ఆరోపణ

12:41 December 01

  •  ఓటు వేసిన మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి

బల్దియా పోలింగ్​లో పాల్గొన్న మాజీ మేయర్  

నాగార్జుననగర్​లో ఓటు వేసిన బండ కార్తీక రెడ్డి

12:38 December 01

  • ఉప్పుగూడ డివిజన్‌లో రీపోలింగ్‌కు కాంగ్రెస్ డిమాండ్

బ్యాలెట్ పత్రంలో తమ అభ్యర్థి పేరు తప్పుగా ముద్రించారని కాంగ్రెస్ ఆరోపణ

12:35 December 01

  • బోరబండ వీకర్ సెక్షన్‌లో స్వల్ప ఉద్రిక్తత

తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ, చెదరగొట్టిన పోలీసులు

12:29 December 01

జంగంమెట్​లో భాజపా, ఎంఐఎం నాయకుల మధ్య ఘర్షణ

జంగంమెట్ 27, 32 పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత

భాజపా, ఎంఐఎం నాయకుల మధ్య ఘర్షణ

రిగ్గింగ్, దొంగ ఓట్లు వేస్తున్నారని భాజపా శ్రేణుల ఆరోపణ

భాజపా, ఎంఐఎం వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాట

12:28 December 01

గోల్నాకలో ఓటు వేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్

గోల్నాకలో ఓటు వేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్

బల్దియా పోలింగ్​లో పాల్గొన్న తెరాస ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్

గోల్నాకలో ఓటు వేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్

నగరవాసులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి

12:24 December 01

  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ సజ్జనార్

కొండాపుర్ డివిజన్ హఫీజ్‌పేట పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ సజ్జనార్

చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్: సీపీ సజ్జనార్

గొడవలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటాం: సీపీ సజ్జనార్

ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: సీపీ సజ్జనార్

12:18 December 01

పోలింగ్‌ కేంద్రాల వద్ద క్రమంగా పెరుగుతున్న రద్దీ

కొనసాగుతున్న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ 

ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్

పోలింగ్‌ కేంద్రాల వద్ద క్రమంగా పెరుగుతున్న రద్దీ 

సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనున్న పోలింగ్ 

కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ 

పలు డివిజన్లలో భాజపా, తెరాస వర్గీయుల మధ్య ఘర్షణలు

డబ్బులు పంచుతున్నారంటూ భాజపా, తెరాస పరస్పర ఆరోపణలు

ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో బ్యాలెట్ పత్రంలో గుర్తులు తారుమారు

ఓల్డ్‌ మలక్‌పేట పోలింగ్‌ రద్దు, ఎల్లుండి రీపోలింగ్‌కు ఎస్‌ఈసీ నిర్ణయం

రీపోలింగ్‌ దృష్ట్యా ఇవాళ సా.6 గం. తర్వాత ఎగ్జిట్‌పోల్స్ వెల్లడి నిషేధం 

12:13 December 01

శేరిలింగంపల్లి జోన్‌లో ఉ.11 గంటల వరకు 12.51 శాతం పోలింగ్ నమోదు

ఉద్రిక్తతలు, గొడవల మధ్య కొనసాగుతున్న బల్దియా పోలింగ్

ఉదయం 11 గంటల వరకు నమోదైన గ్రేటర్ పోలింగ్ శాతం 8.9%

శేరిలింగంపల్లి జోన్‌లో ఉ.11 గంటల వరకు 12.51 శాతం పోలింగ్ నమోదు

కూకట్‌పల్లి జోన్‌లో ఉ.11 గంటల వరకు 13.43 శాతం పోలింగ్ నమోదు

12:05 December 01

ఓటు వేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ దంపతులు

ఓటు వేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ దంపతులు

ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్న జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్

జవహర్​నగర్​ కార్మిక భవన్​లో ఓటు వేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

ఓటు హక్కు వినియోగించుకున్న గాంధీనగర్ డివిజన్ తెరాస అభ్యర్థి ముఠా పద్మ

11:53 December 01

నేను తెరాసకు ఓటేయమని చెప్పలేదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

నా పేరుతో సంచలన వ్యాఖ్యలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం: ఉత్తమ్

నేను తెరాసకు ఓటేయమని చెప్పినట్లు వస్తోన్న వార్తలు అవాస్తవం: ఉత్తమ్

తప్పుడు ప్రచారంతో తెరాస, భాజపా లబ్ధి పొందాలని చూస్తున్నాయి: ఉత్తమ్

11:51 December 01

గోపన్‌పల్లిలో ఉద్రిక్తత

గచ్చిబౌలి డివిజన్‌లోని గోపన్‌పల్లిలో ఉద్రిక్తత

తెరాస, భాజపా కార్యకర్తల వాగ్వాదం, తోపులాట

11:46 December 01

సంజయ్‌నగర్‌లో తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ

జియాగూడ సంజయ్‌నగర్‌లో తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ

తెరాస, భాజపా వర్గీయులను చెదరగొట్టిన పోలీసులు

11:42 December 01

తార్నాకలో తెరాస, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం

తార్నాక డివిజన్‌లో తెరాస, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట

36, 38 పోలింగ్ కేంద్రాల వద్ద తెరాస ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపణ

తెరాస ఏజెంట్లను అడ్డుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఇరువర్గాల మధ్య తోపులాట

11:41 December 01

చిక్కడపల్లిలో ఓటేసిన లక్ష్మణ్..

బల్దియా ఎన్నికల్లో పాల్గొన్న భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్

చిక్కడపల్లిలోని శాంతినికేతన్ కో-ఆపరేటివ్​ బూత్​లో ఓటు వేసిన లక్ష్మణ్

అనంతరం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షాశిబిరానికి వెళ్లిన లక్ష్మణ్

11:38 December 01

న్యూ హఫీజ్‌పేట ఆదిత్యనగర్‌లో ఉద్రిక్తత

న్యూ హఫీజ్‌పేట ఆదిత్యనగర్‌లో ఉద్రిక్తత

తెరాస కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని భాజపా అభ్యర్థి ఆందోళన

తెరాస డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని భాజపా ఆరోపణ

11:35 December 01

బల్దియా ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజాగాయకుడు గద్దర్

బల్దియా ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజాగాయకుడు గద్దర్

బల్దియా ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజాగాయకుడు గద్దర్

అల్వాల్ వెంకటాపురం డివిజన్​లోని మహాబోధి పాఠశాలలో ఓటు వేసిన గద్దర్

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి

11:28 December 01

ఉదయం 11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ నమోదు

గ్రేటర్‌లో ఉదయం 11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ నమోదు

11:26 December 01

ఎగ్జిట్ పోల్స్ నిషేధం: ఎస్ఈసీ

రీపోలింగ్ నేపథ్యంలో ఇవాళ 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ నిషేధం: ఎస్ఈసీ

11:25 December 01

ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో ఎల్లుండి రీపోలింగ్: ఎస్ఈసీ

ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్‌కు ఎస్ఈసీ నిర్ణయం
ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లోని 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు నిర్ణయం 
ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో ఎల్లుండి రీపోలింగ్: ఎస్ఈసీ

గుర్తులు తారుమారు కావడంతో రీపోలింగ్‌కు ఎస్ఈసీ నిర్ణయం

బ్యాలెట్ పత్రంలో సీపీఐ అభ్యర్థి ఎదురుగా సీపీఎం గుర్తు
బ్యాలెట్ పత్రంలో కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తు

11:23 December 01

కూకట్‌పల్లి ఫోరమ్ మాల్ దగ్గర ఉద్రిక్తత

కూకట్‌పల్లి ఫోరమ్ మాల్ దగ్గర ఉద్రిక్తత

డబ్బులు పంచుతున్నారంటూ భాజపా, తెరాస శ్రేణుల పరస్పర ఆరోపణలు

మంత్రి పువ్వాడ అజయ్ కారులో డబ్బులు పంచుతున్నారని భాజపా ఆరోపణ

మంత్రి పువ్వాడ సెక్యూరిటీ సిబ్బంది ఉన్న కారుపై భాజపా కార్యకర్తల దాడి

తెరాస కార్యకర్తను కొట్టిన భాజపా కార్యకర్తలు

11:01 December 01

కేపీహెచ్‌బీ కాలనీలో వద్ద ఉద్రిక్తత

కేపీహెచ్‌బీ కాలనీలో వద్ద ఉద్రిక్తత

కేపీహెచ్‌బీ కాలనీలోని పోలింగ్ కేంద్రం 58 వద్ద ఉద్రిక్తత

తెరాస నాయకులు డబ్బులు పంచుతున్నారని భాజపా కార్యకర్తల ఆందోళన

భాజపా, తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ, చెదరగొట్టిన పోలీసులు

10:57 December 01

ఓల్డ్‌ మలక్‌పేటలో ఓటింగ్ నిలిపివేత

ఓల్డ్‌ మలక్‌పేటలో 1, 2, 3, 4, 5 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిలిపివేత

గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ నిలిపివేసిన అధికారులు

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పోలింగ్ నిలిపివేస్తున్నట్లు అధికారుల వెల్లడి

10:54 December 01

గ్రేటర్‌లో ఉదయం 9 గంటల వరకు 3.96 శాతం పోలింగ్ నమోదు

మందకొడిగా సాగుతున్న గ్రేటర్ ఎన్నికల పోలింగ్

గ్రేటర్‌లో ఉదయం 9 గంటల వరకు 3.96 శాతం పోలింగ్ నమోదు

10:51 December 01

బల్దియా ఎన్నికల్లో ఓటేసిన మురళీధర్ రావు

ఓటు హక్కు వినియోగించుకున్న భాజపా నేత మురళీధర్ రావు

అంబర్​పేట్​ డీడీ కాలనీలో సతీసమేతంగా ఓటు వేసిన మురళీధర్ రావు

ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి

10:42 December 01

జియాగూడలో స్థానిక ఓటర్ల ఆందోళన

హైదరాబాద్: జియాగూడలో స్థానిక ఓటర్ల ఆందోళన

పోలింగ్ కేంద్రం 38లో పెద్దఎత్తున ఓట్లు తొలగించారని నిరసన

914 ఓటర్లకు గాను 195 మాత్రమే ఓట్లు ఉన్నాయంటున్న ఓటర్లు

10:35 December 01

సికింద్రాబాద్ జోన్‌లో ఉ.9 గంటల వరకు 5.5 శాతం పోలింగ్ నమోదు

మందకొడిగా సాగుతున్న జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్

సికింద్రాబాద్ జోన్‌లో ఉ.9 గంటల వరకు 5.5 శాతం పోలింగ్ నమోదు

10:31 December 01

ఎన్నికల సంఘానికి కార్మికుల ఫిర్యాదు..

కాప్రా, కుషాయిగూడ, చర్లపల్లి ప్రాంతాల నుంచి ఎస్ఈసీకి ఫిర్యాదులు

పరిశ్రమల యాజమాన్యాలు ఓటేసేందుకు అనుమతి ఇవ్వట్లేదని కార్మికుల ఫిర్యాదు

ఎస్ఈసీ కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేసిన కార్మికులు

10:27 December 01

ఓటేసిన సినీనటుడు రాజేంద్రప్రసాద్

కేపీహెచ్‌బీ కాలనీలో ఓటేసిన సినీనటుడు రాజేంద్రప్రసాద్

10:21 December 01

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటి మంచు లక్ష్మి

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటి మంచు లక్ష్మి

ఫిల్మ్​నగర్​లో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటి మంచు లక్ష్మి

కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఓటు వేయాలని సూచన

ప్రతి ఒక్కరు ఓటు వేసి.. పోలింగ్ శాతం పెంచాలని విజ్ఞప్తి

10:18 December 01

ఎన్బీటీ నగర్‌లోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్‌లోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

భాజపా కార్యకర్తలు కాషాయ మాస్కులు ధరించారని తెరాస శ్రేణుల ఆరోపణ

తెరాస నేతలు చేతులకు గులాబీ కంకణాలు కట్టుకున్నారని భాజపా శ్రేణుల ఆందోళన

భాజపా, తెరాస వర్గాల మధ్య వాగ్వాదం, చెదరగొట్టిన పోలీసులు

10:16 December 01

ఓటేసిన మంత్రి తలసాని..

ఓటేసిన మంత్రి తలసాని

సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ కళాశాలలో ఓటేసిన మంత్రి తలసాని

10:06 December 01

ఓల్డ్ మలక్‌పేటలో తారుమారైన గుర్తులు

గుర్తులు తారుమారు

ఓల్డ్ మలక్‌పేటలో తారుమారైన గుర్తులు
బ్యాలెట్ పత్రంలో సీపీఐ అభ్యర్థి ఎదురుగా సీపీఎం గుర్తు
బ్యాలెట్ పత్రంలో కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తు

ఎన్నికల్ అథారిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్న ఎస్ఈసీ

09:59 December 01

ఓల్డ్ మలక్‌పేట్‌ డివిజన్‌లో పోలింగ్ నిలిపివేయాలి : సీపీఐ

ఓల్డ్ మలక్‌పేట్‌ డివిజన్‌లో పోలింగ్ నిలిపివేయాలని సీపీఐ డిమాండ్

బ్యాలెట్ పత్రంలో కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి ఉంది: చాడ వెంకట్‌రెడ్డి

ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యమే కారణం: చాడ వెంకట్‌రెడ్డి

09:56 December 01

మన్సూరాబాద్‌ డివిజన్‌లో భాజపా శ్రేణుల ఆందోళన

హైదరాబాద్: మన్సూరాబాద్‌ డివిజన్‌లో భాజపా శ్రేణుల ఆందోళన

తెరాస కార్యకర్తలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని భాజపా ఆరోపణ

09:55 December 01

ఓటేసిన అక్కినేని నాగార్జున-అమల

ఓటేసిన అక్కినేని నాగార్జున-అమలnaga

జూబ్లీహిల్స్‌ ఉమెన్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఓటేసిన నాగార్జున, అమల

09:50 December 01

పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది : డీజీపీ

గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి: డీజీపీ మహేందర్‌రెడ్డి
పోలీస్‌ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేశాం: డీజీపీ మహేందర్‌రెడ్డి
ప్రజలందరూ నిర్భయంగా ఓటేయండి: డీజీపీ మహేందర్‌రెడ్డి

09:47 December 01

పాతబస్తీలో ఓట్ల గల్లంతు..

పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, ఇంద్రానగర్​లో ఓట్లు గల్లంతు

30 ఏళ్ల నుంచి ఓటేస్తున్నా.. ఇప్పుటు ఓటు లేదంటున్నారని బాధితుల ఆవేదన

కొందరి ఓట్లు వేరే డివిజన్​కు మార్చారని వాపోయిన ఓటర్లు

09:45 December 01

ఓటేసిన మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు

ఓటేసిన మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు

కుషాయిగూడలో ఓటేసిన మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు

09:42 December 01

ఓటేసిన సినీ నటుడు, నిర్మాత అశోక్ కుమార్

ఫిలింనగర్​లోని క్లబ్​లో ఓటేసిన సినీ నటుడు, నిర్మాత అశోక్ కుమార్

ఉదయం 9 గంటల వరకు 6.14% పోలింగ్ శాతం నమోదు

09:38 December 01

ఓటు హక్కు వినియోగించుకున్న కోదండరాం..

ఓటు హక్కు వినియోగించుకున్న కోదండరాం..

బల్దియా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తెజస అధ్యక్షుడు కోదండరాం

తార్నాకలో ఓటు వేసిన కోదండరాం దంపతులు

నైతిక బాధ్యతగా.. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్న కోదండరాం

09:32 December 01

ఓటేసిన డీజీపీ మహేందర్‌రెడ్డి..

కుందన్‌బాగ్‌లో ఓటేసిన డీజీపీ మహేందర్‌రెడ్డి, కుటుంబసభ్యులు

09:29 December 01

గ్రేటర్‌లో ఉదయం 9 గంటల వరకు 3.10 శాతం పోలింగ్ నమోదు

హైదరాబాద్​లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

గ్రేటర్‌లో ఉదయం 9 గంటల వరకు 3.10 శాతం పోలింగ్ నమోదు

09:28 December 01

చార్మినార్ జోన్‌లో ఉదయం 9 గంటల వరకు 7 శాతం పోలింగ్ నమోదు

ప్రశాంతంగా కొనసాగుతున్న బల్దియా పోలింగ్

చార్మినార్ జోన్‌లో ఉదయం 9 గంటల వరకు 7 శాతం పోలింగ్ నమోదు

09:26 December 01

హబ్సిగూడలో ఓటేసిన ఎమ్మెల్యే సుభాశ్​ రెడ్డి దంపతులు

హబ్సిగూడలో ఓటేసిన ఎమ్మెల్యే సుభాశ్​ రెడ్డి దంపతులు

హబ్సిగూడలో ఓటేసిన ఎమ్మెల్యే సుభాశ్​ రెడ్డి దంపతులు

ఓటు హక్కు వినియోగించుకున్న తెరాస అభ్యర్థి స్వప్న సుభాశ్ రెడ్డి

09:18 December 01

ఓటేసిన ఎస్​ఈసీ పార్థసారథి..

ఓటేసిన ఎస్​ఈసీ పార్థసారథి..

గ్రేటర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించనున్న ఎస్ఈసీ పార్థసారథి

బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు-4లో ఓటేసిన ఎస్ఈసీ పార్థసారథి

09:11 December 01

  • ఓటేసిన మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి

జూబ్లీహిల్స్‌లో ఓటేసిన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్

09:00 December 01

ఓటేసిన ఎమ్మెల్సీ రాంచందర్ రావు

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ రాంచందర్​రావు

తార్నాకలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ రాంచందర్​రావు

సెలవు దినంగా భావించకుండా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని విజ్ఞప్తి

08:34 December 01

ఓటేసిన సీఎస్ సోమేశ్ కుమార్

ఓటేసిన సీఎస్ సోమేశ్ కుమార్

ఉప్పర్‌పల్లిలో ఓటేసిన సీఎస్ సోమేశ్‌కుమార్, కుటుంబసభ్యులు

08:22 December 01

ఓటు హక్కు వినియోగించుకున్న సీజే చౌహాన్..

ఓటు హక్కు వినియోగించుకున్న సీజే చౌహాన్..

ఓటేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్..

కుందన్‌బాగ్‌లో ఓటేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్

08:14 December 01

ఈసీ కార్యాలయం నుంచి వెబ్​ క్యాస్టింగ్
  • ఎస్​ఈసీ కార్యాలయం నుంచి వెబ్​ క్యాస్టింగ్​ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ

వెబ్​ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న అధికారులు

9100 పోలింగ్ కేంద్రాల్లో 2277 కేంద్రాల్లో వెబ్​ క్యాస్టింగ్ సౌకర్యం

08:08 December 01

  • ఓటు హక్కు వినియోగించుకున్న మాదాపూర్ డీసీపీ

అమీర్‌పేట డివిజన్ కుందన్‌బాగ్‌లో ఓటేసిన మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు

08:05 December 01

  • పటాన్‌చెరు డివిజన్‌ పోలింగ్‌ స్టేషన్‌-20లో పోలింగ్‌ ఆలస్యం

40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్‌ 

కొద్ది సేపు వేచిచూసి పోలింగ్‌ కేంద్రం-19లో ఓటేసిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

పోలింగ్‌ ఆలస్యం కావడంతో సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం

08:02 December 01

  • ఓటేసిన ఉప మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌..

బోరబండలోని సైట్‌వన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఉప మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌

07:57 December 01

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి: మహేశ్‌ భగవత్‌

  • ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి: సీపీ మహేశ్‌ భగవత్‌
  • ప్రజాస్వామ్యంలో అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి: మహేశ్‌ భగవత్‌
  • ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు: సీపీ మహేశ్‌ భగవత్‌
  • పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలతో నిఘా: మహేశ్‌ భగవత్‌
  • రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణం: మహేశ్‌ భగవత్‌
  • కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: మహేశ్‌ భగవత్‌
  • సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచాం: సీపీ మహేశ్‌ భగవత్‌

07:54 December 01

శాస్త్రిపురంలో ఓటేసిన ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ

శాస్త్రిపురంలో ఓటేసిన ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ

హైదరాబాద్‌: శాస్త్రిపురంలో ఓటేసిన ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ

07:45 December 01

తెరాస ఏజెంట్లు గులాబీ రంగు మాస్కులు ధరించడంపై కాంగ్రెస్ అభ్యంతరం

తెరాస ఏజెంట్లు గులాబీ రంగు మాస్కులు ధరించడంపై కాంగ్రెస్ అభ్యంతరం

ఎస్‌ఈసీ పార్థసారథికి ఫిర్యాదు చేసిన పీసీసీ ఎన్నికల కమిటీ కన్వీనర్ నిరంజన్‌

తెరాస ఏజెంట్లు గులాబీ రంగు మాస్కులు ధరించారని కాంగ్రెస్ ఫిర్యాదు

07:42 December 01

ఓటు వేసిన పరుచూరి, శ్యాంప్రసాద్ రెడ్డి

ఓటు హక్కు వినియోగించుకున్న పరుచూరి దంపతులు

పిల్మ్ నగర్ క్లబ్​లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి

పిల్మ్ నగర్ క్లబ్​లో ఓటు హక్కు వినియోగించుకున్ పరుచూరి గోపాలకృష్ణ దంపతులు

07:40 December 01

ఓటు హక్కు వినియోగించుకున్న సీపీలు.. అంజనీకుమార్, సజ్జనార్

ఓటు హక్కు వినియోగించుకున్న సీపీ సజ్జనార్

అంబర్‌పేట ఇండోర్ స్టేడియంలో ఓటేసిన హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్

నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్‌లో ఓటేసిన సైబరాబాద్ సీపీ సజ్జనార్

07:36 December 01

జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటు క్కు వినియోగించుకున్న చిరంజీవి

ఓటేసిన మెగాస్టార్ దంపతులు

జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటు క్కు వినియోగించుకున్న చిరంజీవి దంపతులు

07:35 December 01

పటాన్‌చెరు పోలింగ్ కేంద్రం 20లో ప్రారంభంకాని ఓటింగ్

పటాన్‌చెరు పోలింగ్ కేంద్రం 20లో ప్రారంభంకాని ఓటింగ్

పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు క్యూలో నిల్చున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

07:19 December 01

ప్రజలంతా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్

ఓటు వేసిన మంత్రి కేటీఆర్

ప్రజాస్వామ్యంలో ఓటు వేసే వారికే నిలదీసే హక్కు ఉంటుంది: కేటీఆర్
నగర పౌరులు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు రండి: కేటీఆర్ 
ప్రజలంతా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరం: కేటీఆర్

07:17 December 01

ఓటు వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు..

ఓటు వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు..

కాచిగూడ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు

ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు

07:04 December 01

ఓటేసిన మంత్రి కేటీఆర్..

  • నందినగర్ పోలింగ్ కేంద్రంలో ఓటేసిన మంత్రి కేటీఆర్
  • నందినగర్‌ పోలింగ్ కేంద్రంలో ఓటేసిన మంత్రి కేటీఆర్ దంపతులు

06:40 December 01

కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలతో పోలింగ్

  • కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలతో పోలింగ్
  • ఓటింగ్ కోసం తెలుపురంగు బ్యాలెట్ పత్రాలు వినియోగం
  • మొత్తం 81,88,686 బ్యాలెట్ పత్రాల ముద్రణ
  • పోలింగ్ కోసం 28, 683 బ్యాలెట్ బాక్సులు వినియోగం
  • మొత్తం 150 డివిజన్లలో పోటీపడుతున్న1122 మంది అభ్యర్థులు

06:36 December 01

కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రేటర్ ఎన్నికల పోలింగ్

  • పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా మార్గదర్శకాలు పాటించాలని ఆదేశాలు
  • ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలని ఎస్‌ఈసీ సూచన
  • 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్‌ సౌకర్యం
  • కరోనా బాధితులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వెసులుబాటు
  • సా.5 నుంచి 6 గంటల వరకు కరోనా బాధితులు ఓటేసేందుకు అనుమతి

06:32 December 01

బల్దియాలో 74,44,260 మంది ఓటర్లు..

  • గ్రేటర్‌లో ఓటుహక్కు వినియోగించుకోనున్న 74,44,260 మంది ఓటర్లు
  • జీహెచ్‌ఎంసీలో పురుష ఓటర్లు 38,77,688 మంది
  • జీహెచ్‌ఎంసీలో మహిళా ఓటర్లు 35,65,896 మంది
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇతర ఓటర్లు 676 మంది
  • మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో అత్యధికంగా 79,290 మంది ఓటర్లు
  • రామచంద్రాపురం డివిజన్‌లో అత్యల్పంగా 27,998 మంది ఓటర్లు

06:30 December 01

జంగంమెట్‌ డివిజన్‌లో అత్యధికంగా 20 మంది అభ్యర్థులు

  • గ్రేటర్ ఎన్నికల బరిలో 1,122 మంది అభ్యర్థులు
  • జంగంమెట్‌ డివిజన్‌లో అత్యధికంగా 20 మంది అభ్యర్థులు
  • ఉప్పల్, బార్కస్, నవాబ్‌సాహెబ్‌కుంటలో అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు
  • జీడిమెట్ల, టోలీచౌకి డివిజన్లలో అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు

06:11 December 01

గ్రేటర్​లో ముగిసిన పోలింగ్

  • ప్రారంభమైన జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్​ ప్రారంభం
  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్
  • మొత్తం 150 డివిజన్లకు 1122 మంది అభ్యర్థుల పోటీ
Last Updated : Dec 1, 2020, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details