లాక్డౌన్ వేళ పేదలను ఆదుకునేందుకు ఆర్థికంగా బలంగా ఉన్నవారు ముందుకురావాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కోరారు. హైదరాబాద్ నాంపల్లిలోని మాలకుంట బస్తీలో సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరకులను పంపిణీ చేశారు. రోజువారి కూలీలను ఆదుకునేందుకు ముందుకువచ్చిన ఫౌండేషన్ ఛైర్మన్ రాజేశ్‌ను డిప్యూటీ మేయర్ అభినందించారు.
నిత్యవసర సరకులు పంపిణీ చేసిన డిప్యూటీ మేయర్
హైదరాబాద్ నాంపల్లిలోని మాలకుంట బస్తీలో సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారు పేదలను ఆదుకునేందుకు ముందుకురావాలని కోరారు.
నిత్యవసర సరకులు పంపిణీ చేసిన డిప్యూటీ మేయర్
వైరస్ కట్టడిలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రజల తోడ్పాటు లేనిదే కరోనా నియంత్రణ సాధ్యంకాదన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉంటూ దేశాన్ని కాపాడాలని కోరారు.
ఇవీచూడండి:దయనీయ స్థితిలో వలస కూలీ... కడుపు ఖాళీ