తెలంగాణ

telangana

ETV Bharat / city

వలస కూలీలపై ప్రభుత్వా ఆదేశానుసారం ముందుకెళ్తాం: లోకేశ్​ కుమార్​ - తెలంగాణలో వలస కూలీల పరిస్థితి

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వలస కూలీలకు 12 కిలోల బియ్యం, రూ.500 నగదు ఇస్తామని జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​కుమార్​ తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల 95,859 మంది వలస కార్మికులు లాక్​డౌన్​ కారణంగా ఆయా ప్రాంతాల్లోనే ఉండిపోయినట్లు అధికారులు గుర్తించారు.

ghmc
వలస కూలీలపై ప్రభుత్వా ఆదేశానుసారం ముందుకెళ్తాం: లోకేశ్​ కుమార్​

By

Published : Mar 31, 2020, 5:54 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆహార భద్రత కార్డులు అందుబాటులో లేనప్పటికీ వలస కార్మికులందరికీ 12 కిలోల బియ్యం, రూ.500 నగదు ఇవ్వనున్నట్లు జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​కుమార్ తెలిపారు.

జీహెచ్​ఎంసీ ఎంపిక చేసిన కేంద్రాలలో పోలీస్, రెవెన్యూ, చీఫ్ రేషనింగ్ అధికారుల సహకారంతో బియ్యం, నగదు పంపిణీ చేస్తామన్నారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఎక్కువ మంది గుమిగూడకుండా సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ అంశంలో ఎటువంటి అక్రమాలు జరిగినా సంబంధిత వ్యక్తి రేషన్ కార్డు రద్దుచేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు 948 ప్రదేశాల్లో జరుగుతున్న నిర్మాణ, ఇతర పనులకు వచ్చిన 95,859 మంది వలస కార్మికులు ఆయా ప్రాంతాల్లోనే ఉండిపోయినట్లు జీహెచ్​ఎంసీ అర్బన్ కమ్మూనిటీ డెవలప్​మెంట్,​ టౌన్​ ప్లానింగ్, రెవెన్యూ, కార్మిక శాఖ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ నిర్ణయంపై వలస కూలీలు సంతోషం వ్యకం చేస్తున్నారు.

ఇవీచూడండి:రాష్ట్రంలో మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు​

ABOUT THE AUTHOR

...view details