ప్రస్తుతం హైదరాబాద్‌లో విషజ్వరాలు తగ్గుముఖం పట్టాయని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 2400, హైదరాబాద్‌లో 845 డెంగీ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కేసుల వివరాలను అంతర్జాలంలో పొందుపరుస్తున్నామని పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా అంటువ్యాధులు ప్రబలకుండా ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తొన్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో విషజ్వరాలు తగ్గుముఖం పట్టాయి: జీహెచ్ఎంసీ కమిషనర్ - నగరంలో విషజ్వరాలు తగ్గుముఖం పట్టాయి: కమిషనర్
హైదరాబాద్ నగరంలో విషజ్వరాలు తగ్గుముఖం పట్టాయని జీహెచ్ఎంసీ కమిషనర్ లోక్శ్కుమార్ తెలిపారు. ఎంటమాలజీ సిబ్బంది నగరవ్యాప్తంగా లార్వా నివారణ కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. ప్రధాన ఆస్పత్రులో అదనపు సిబ్బందిని నియమించి వైద్యసేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
దోమలవ్యాప్తిని అరికట్టడం ద్వారా అంటువ్యాధుల నివారణకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎంటమాలజీ సిబ్బంది నిరంతరం లార్వా నివారణ కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతపై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతిరోజూ 650 ఎంటమాలజీ బృందాలు దోమల వ్యాప్తికి కారణమైన లార్వా ఉత్పత్తి కేంద్రాలు గుర్తించేందుకు లక్షకుపైగా గృహాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో 25 మంది చొప్పున అదనపు వైద్యులను నియమించి, ఓపీ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు... లోతట్టుప్రాంతాలు జలమయం