తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీశైలం వద్ద ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ, 7గేట్లు ఎత్తి నీరు విడుదల

Water Level in Srisailam ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 884.90 అడుగులుగా ఉంది.

Srisailam
Srisailam

By

Published : Aug 28, 2022, 9:44 PM IST

Water Level in Srisailam: శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 2.43 లక్షల క్యూసెక్కుల వరదనీరు రావడంతో జలాశయం 7 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా లక్షా 96వేల 203 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత 884.90 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215.3263 టీఎంసీలుగా నమోదు అయింది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. నాగార్జునసాగర్​కు 63,068 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details