రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో బొజ్జ గణపయ్యకు బై బై చెప్తున్నారు. జంట నగరాల్లో గణేశ్ నిమజ్జనాల సందడి నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు - వినాయక నిమజ్జనాలు
రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. జంట నగరాల్లో భక్తి శ్రద్ధలతో భక్తులు నిమజ్జనాలు చేస్తున్నారు. మూడో రోజు కావడంతో ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్ ట్యాంక్‌బండ్, కూకట్‌పల్లి, ఉప్పల్ చెరువు ప్రాంతాల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఎల్‌బీ నగర్, నాగోల్, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి నుంచి కార్లు, ద్విచక్ర వాహనాల్లో ప్రతిమలను తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు
ఇవాళ మూడో రోజు కావడంతో హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్, కూకట్‌పల్లి, ఉప్పల్ చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఎల్‌బీ నగర్, నాగోల్, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి నుంచి కార్లు, ద్విచక్ర వాహనాల్లో ప్రతిమలను తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు. రాబోయే ఏడాదికి కరోనా మహమ్మారి శాశ్వతంగా వెళ్లిపోయి ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నారు.
ఇవీ చూడండి:యాదాద్రి ఆలయంలో తుదిదశకు చేరిన మరమ్మతులు