Corona Symptoms : రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇంటింటా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. జ్వర సర్వేలో, ప్రభుత్వాసుపత్రుల్లోని ఓపీ సేవల్లో ఈ విషయం స్పష్టమైంది. కేవలం 9 రోజుల వ్యవధిలోనే మొత్తం 4,00,283 మందిలో కొవిడ్ లక్షణాలున్నట్లు గుర్తించారు. మొత్తం 90లక్షల పైచిలుకు ఇళ్లలోనూ, ఆసుపత్రి ఓపీల్లో మరో 6.58 లక్షల మందిని పరిశీలించగా పై విషయం నిర్ధారణ అయింది. వైరస్ నిర్ధారణ కాకపోయినా.. 3,97,898 మందికి ఔషధ కిట్లు అందజేశారు. ఈ నెల 21 నుంచి 29 వరకూ జ్వర సర్వే, కొవిడ్ ఓపీ సేవల్లో భాగంగా కిట్లను పంపిణీ చేశారు. శనివారం(29)తో తొలివిడత సర్వే పూర్తయ్యింది. రెండో విడత సర్వే జగిత్యాల, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్, వనపర్తి, నిజామాబాద్, భద్రాద్రి, మంచిర్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మొదలైంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.
Corona Cases in Telangana Today : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో 1,170 ఓపీ కేంద్రాలను నిర్వహించగా.. 6,58,879 మందిలో జలుబు, జ్వరం తదితర సమస్యలు బయటపడ్డాయి. వీరిలో 94,910 మందికి కొవిడ్ లక్షణాలున్నట్లు వైద్యసిబ్బంది గుర్తించారు. వారికి కొవిడ్ ఔషధ కిట్లు అందజేశారు. ఓపీ సేవల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 1,70,962 మంది వైద్యులను సంప్రదించారు. ఇక్కడ 18,758 ఔషధ కిట్లను పంపిణీ చేశారు. ఆతర్వాత భద్రాద్రి కొత్తగూడెం (9,170), మేడ్చల్ మల్కాజిగిరి (8,278), ఖమ్మం (5,346), నల్గొండ (4,374), రంగారెడ్డి (3,856), సంగారెడ్డి (3,138), కరీంనగర్ (3,123), మంచిర్యాల (3,093), పెద్దపల్లి (2,897), నిజామాబాద్ (2,833), నాగర్‌కర్నూల్ (2,804), యాదాద్రి భువనగిరి (2,503), సిద్దిపేట (2,135) జిల్లాల్లో అత్యధిక ఔషధ కిట్లను పంపిణీ చేశారు. అతి తక్కువగా మహబూబాబాద్ జిల్లాలో 185మందికి లక్షణాలున్నట్లు గుర్తించారు.
హనుమకొండలో అత్యధికులు