సంక్షోభంలోనూ సంక్షేమం సృష్టించగల మహా నాయకులు మాజీ ప్రధాని పీవీ, సీఎం కేసీఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆరేళ్ల క్రితానికి ఇప్పటికీ ఎలాంటి మార్పు వచ్చిందో గమనించాలని పట్టభద్రులను కోరారు. మాసబ్‌ట్యాంక్‌లో ఆల్ యూనివర్శిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోషియేషన్‌తో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు.
'లక్షా 33వేల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు లక్షలాది ప్రైవేటు ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మొదలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకూ జరిగిన అభివృద్ధిని చూడాలి. ప్రపంచ స్థాయి కంపెనీలు గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ లాంటి సంస్థలు దేశంలో కేవలం హైదరాబాద్‌లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కేసీఆర్ అందిస్తున్న సుస్థిర పాలన, శాంతి భద్రతల పరిరక్షణే కారణం. ఈ అభివృద్ధి కొనసాగించడానికి హైదరాబాద్ - రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కేసీఆర్‌కు మద్దతు తెలపాలి.'