తెలంగాణ

telangana

ETV Bharat / city

పరిహారం కోసం రహదారిపై వరద బాధితుల ఆందోళన - పరిహారం కోసం బాధితుల ఆందోళన

హైదరాబాద్ చంపాపేట్‌లో వరద ముంపు ప్రాంతాల బాధితులు రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అర్హులకు చేరడం లేదని ఆరోపించారు.

flood victims protest on santoshnagar lbnagar road at champapeta
పరిహారం కోసం రహదారిపై వరద బాధితుల ఆందోళన

By

Published : Oct 29, 2020, 8:06 PM IST

వరద సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రూ.10వేల ఆర్థిక సాయం అర్హులకు అందడం లేదని... హైదరాబాద్​ చంపాపేట్​లో వరద బాధితులు ఆందోళన చేశారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో సంతోష్​నగర్​ నుంచి ఎల్బీనగర్​ ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వర్షం నీరు ఇళ్లల్లోకి వచ్చి తమ వాహనాలు పూర్తిగా చెడిపోయాయని... అయినా ఇప్పటి వరకు అధికారులు ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:సాయం కోసం ముంపు ప్రాంత బాధితుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details