సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో రూ. 10 వేల వరద సాయం అందని నిరుపేదలు తుకారాంగేట్లో ఉన్న మీ సేవలో దరఖాస్తు చేసుకునేందుకు పోటీ పడ్డారు. పెద్ద సంఖ్యలో వరద బాధితులు ఉదయం 8 గంటల నుంచే క్యూ కట్టారు. ఇంటి యజమానితో పాటు అద్దెకు ఉంటున్న బాధితులు మీ సేవ దరఖాస్తు చేసుకున్నారు.
మీ సేవ వద్ద బారులు తీరిన వరద బాధితులు - సికింద్రాబాద్ వరద బాధుతుల వార్తలు
వరద పరిహారం కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు బాధితులు భారీగా మీ సేవ సెంటర్లకు తరలివస్తున్నారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో ఉన్న మీ సేవకు బాధితులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు క్యూ కట్టారు. వరద సాయం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు సూచనలతో బాధితులు మీ సేవ వద్ద బారులు తీరారు.
మీ సేవ వద్ద బారులు తీరిన వరద బాధితులు
డిప్యూటీ స్పీకర్ పద్మారావు.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించడం వల్ల మొదటి రోజైన సోమవారం పెద్ద సంఖ్యలో బాధితులు బారులుతీరారు. రెండు కిలోమీటర్ల దూరం వరకు క్యూ కట్టారు. సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలన్న ప్రచారంతో పెద్ద ఎత్తున బాధితులు తరలివచ్చారు.
ఇదీ చదవండి:వరద సహాయంపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి