ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో మళ్లీ అలజడి మొదలైంది. గుండ్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్య దశ దిన కార్యక్రమం సందర్భంగా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు.
FLEXI CONTROVERSY: గుండ్లపాడులో ఫ్లెక్సీ వివాదం.. విచారణ చేస్తున్న పోలీసులు - FLEXI CONTROVERSY IN GUNDLAPADU GUNTUR DISTRICT
ఏపీలోని గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో మళ్లీ అలజడి మొదలైంది. గుండ్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్య దశ దిన కార్యక్రమం సందర్భంగా కుటుంబసభ్యులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు.
గుండ్లపాడులో ఫ్లెక్సీ వివాదం.. విచారణ చేస్తున్న పోలీసులు
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, పలువురు తెదేపా అభిమానులు ఫ్లెక్సీని చించిన సెంటర్ వద్దకు చేరుకున్నారు. ఇది వైకాపా నేతల పనేనని ఆరోపించారు. గ్రామానికి వెళ్లిన వెల్దుర్తి ఎస్సై తిరుపతి రావుకి ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీ వివాదం రీత్యా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నందున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
TAGGED:
FLEXI CONTROVERSY