PRAKASAM BARRAGE: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తడంతో జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద భారీగా వస్తుండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస‌్తున్నారు. ప్రస్తుతం 4లక్షల 10 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. సముద్రంలోకి 3 లక్షల 97 వేల క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. పంట కాల్వలకు 13 వేల క్యూసెక్కులు వెళ్తున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసిన నేపథ్యంలో.. సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ప్రకాశం బ్యారేజ్‌కి పోటెత్తిన వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ - ఏపీ తాజా వార్తలు
PRAKASAM BARRAGE: ఏపీలో ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండడంతో.. బ్యారేజ్ నిండుకుండలా మారింది. దీంతో.. మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజ్