ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగితే ఎలా స్పందించాలి? రోగులకు ఎటువంటి హాని జరగకుండా సురక్షితంగా ఎలా తరలించాలి? అనే అంశాలపై అగ్నిమాపక శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ విక్రమ్‌పురి కాలనీ రెయిన్‌బో ఆసుపత్రిలో ఈ కార్యక్రమం జరిగింది. అగ్ని ప్రమాదం గురించి తెలియగానే ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించాల్సిన తీరు గురించి వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో పాటు ఆందోళన చెందకుండా సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆందోళన వద్దు... ఇలా చెేద్దాం...
అగ్నిప్రమాదాలు సంభవిస్తే ఊహించని నష్టం ఎదురవుతుంది. ఆసుపత్రుల్లో ఈ తరహా ప్రమాదాలు జరిగితే ప్రాణ, ఆస్తి నష్టాలు తీరని విషాదాన్ని నింపుతాయి. వైద్యశాలలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి? సిబ్బంది తక్షణం స్పందించి మంటల్లో చిక్కుకున్న రోగులను సురక్షితంగా ఏ విధంగా తరలించాలి? తదితర అంశాలపై అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
మంటలను అగ్నిమాపక పరికరాలతో ఎలా ఆర్పివేయాలో ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు. నీటిని చిమ్ముతూ నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఏటా అగ్నిమాపక వారోత్సవాల్లో ఆసుపత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్ వంటి ప్రాంతాల్లో మాక్ డిల్ నిర్వహించి ప్రజల్లో ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నెల 20తో వారోత్సవాలు ముగియనున్నాయి. ఇవీ చూడండి: రెవెన్యూ శాఖకు అస్తిత్వం లేకుండా చేస్తారా?