తెలంగాణ

telangana

ETV Bharat / city

విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్​లో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి - covid care center fire accidnet

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనతో కరోనా రోగులు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారు.

fire-accident-in-vijayawada-covid-care-center-swarna-palous
ఏపీలోని విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్​లో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

By

Published : Aug 9, 2020, 7:42 AM IST

ఏపీలోని విజయవాడ స్వర్ణ ప్యాలెస్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్​గా చికిత్స అందిస్తున్న ఈ ప్యాలెస్​లో పొగలు దట్టంగా అలుముకొని... శ్వాస తీసుకోవడంలో కరోనా బాధితులు ఇబ్బందులు పడ్డారు. కిటికీల్లోంచి కేకలు వేసిన దృశ్యాలు ఆందోళన రేపాయి.

సకాలంలో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం లోపల చిక్కుకున్న వారిని... బయటకు తీసుకొచ్చి ఆంబులెన్సుల ద్వారా.. లబ్బీపేటలోని రమేశ్‌ ఆస్పత్రికి చెందిన మరో సెంటర్‌కు తరలిస్తున్నారు. ప్యాలెస్​లో 30 మంది వరకు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుండగా... 10 మంది సిబ్బంది వైద్యసేవలు అందిస్తున్నారు.

ఇవీ చూడండి: నేడు దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు...

ABOUT THE AUTHOR

...view details