తెలంగాణ

telangana

ETV Bharat / city

TTD: 'ఆ ఉద్యోగి స్నేహితుడి వల్లే ఎల్​ఈడీ తెరపై సినిమా పాటలు'

TTD: తిరుమల శ్రీవారి భక్తి కార్యక్రమాలు ప్రసారం కావాల్సిన తెరపై.. సినిమా పాటలు రావటంతో భక్తులు విస్మయానికి గురయ్యారు. దీనిపై.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తొలుత సాంకేతిక సమస్యగా గుర్తించామన్న ఆయన.. ప్రాథమిక విచారణలో బ్రాడ్‌కాస్ట్‌లో పనిచేసే ఉద్యోగి.. తన స్నేహితుడిని బ్రాడ్‌కాస్ట్‌ గదిలోకి తీసుకెళ్లడమే కారణమని వివరించారు.

TTD: 'ఆ ఉద్యోగి స్నేహితుడి వల్లే ఎల్​ఈడీ తెరపై సినిమా పాటలు'
TTD: 'ఆ ఉద్యోగి స్నేహితుడి వల్లే ఎల్​ఈడీ తెరపై సినిమా పాటలు'

By

Published : Apr 24, 2022, 12:03 PM IST

TTD: తిరుమలలో శుక్రవారం సాయంత్రం ఎల్‌ఈడీ తెరపై ప్రసారమైన సినిమా పాటల వివాదంపై.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. 'తొలుత సాంకేతిక సమస్యగా గుర్తించాం. ప్రాథమిక విచారణలో బ్రాడ్‌కాస్ట్‌లో పనిచేసే ఉద్యోగి.. తన స్నేహితుడిని బ్రాడ్‌కాస్ట్‌ గదిలోకి తీసుకెళ్లాడని తేలింది. అత్యవసర పనిపై స్నేహితుడిని అక్కడే ఉంచి ఆయన వైకుంఠం-2 వరకు వెళ్లాడు. ఉద్యోగి స్నేహితుడు అక్కడున్న రిమోట్‌తో ఆపరేట్‌ చేయడంతో ఇలా జరిగిందని గుర్తించాం. పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని ధర్మారెడ్డి తెలిపారు.

ఇదీ జరిగింది..

Movie Songs at tirumala: తిరుమలలో శ్రీవారి భక్తి పాటలు, స్వామి వారి సేవలతో రూపొందించిన లఘు చిత్రాలు ప్రసారం చేసేందుకు ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ తెరపై.. శుక్రవారం సినిమా పాటలు ప్రసారమయ్యాయి. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద భక్తులు సేద తీరే షెడ్‌లో ఉన్న ఎల్‌ఈడీ తెరపై.. సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల 15 నిమిషాల వరకు సినిమా పాటలు, వ్యాపార ప్రకటనలు ప్రసారమయ్యాయి. శ్రీవారి భక్తి కార్యక్రమాలు ప్రసారం అవ్వాల్సిన తెరపై.. పాటలు రావటంతో భక్తులు విస్మయానికి గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details