కామంతో కళ్లు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు కన్నతండ్రి. వావి వరసలు మరిచిపోయి కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు.. మానవత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కన్నకూతురుపైనే ఏడాదిన్నర నుంచి అత్యాచారం - andhrapradesh news
మానవత్వం మంటగలిసేలా ప్రవర్తించాడు ఓ తండ్రి.. కామంతో కళ్లు మూసుకుపోయి పశువులా ప్రవర్తించాడు.. కన్నకూతురిపైనే దారుణానికి ఒడిగట్టాడు. ఏడాదిన్నర కాలంగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో జరిగింది.
kasai tandri
కన్న కూతురిపై తండ్రి ఏడాదిన్నర కాలంగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి పెట్టే హింసలు తాళలేక కుమార్తె.. తల్లికి విషయం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :కోలుకుంటున్న సాయి తేజ్.. ఐసీయూలో పర్యవేక్షణ