మేడ్చల్ జిల్లా కీసర మండల తహసీల్దార్ నాగరాజు అక్రమాలు ఒక్కోటిగా వెలుగుచూస్తున్నాయి. 173, 174, 175, 176, 179, 219 సర్వే నెంబర్లలో ఉన్న 94 ఎకరాల దళితుల భూమి 1981 తమకు అప్పగించారని రైతులు ధర్నా చేపట్టారు. 2006 నుంచి పట్టదారులకు, కౌలుదారులకు కోర్టులో వివాదం నడుస్తున్నట్టు తెలిపారు.
కీసర తహసీల్దార్ కార్యాలయం ముందు రైతుల ధర్నా - తహసీల్దార్ కార్యాలయం ముందు రైతుల ధర్నా
మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేశారు. రియల్టర్లతో కుమ్మక్కై పట్టా చేసిన భూమి వివాదం కోర్టులో కేసు నడుస్తుండగా... పాసు పుస్తకాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
కీసర తహసీల్దార్ కార్యాలయం ముందు రైతుల ధర్నా
కేసు విచారణలో ఉండగా... నిబంధనలకు విరుద్ధంగా తహసీల్దార్ రియల్టర్లతో కుమ్మకై... 25 ఎకరాల భూమికి పాస్ పుస్తకాలు ఇప్పించారని ఆరోపించారు. విచారించాలని జాయింట్ కలెక్టర్‌ను 2018లో కోర్టు ఆదేశించింది. కానీ అంతకుముందే తహసీల్దార్ పాస్ పుస్తకాలు ఇవ్వడం వల్ల... పై కోర్టుకు వెళ్లాలని ఇబ్బందులు పెట్టినట్టు వివరించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Last Updated : Aug 18, 2020, 4:45 PM IST