తెలంగాణ

telangana

ETV Bharat / city

మద్యం లేకపోతే మళ్లీ గుడుంబా వస్తది: శ్రీనివాస్ గౌడ్

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ అన్నారు. ముఖ్యమంత్రి ఎన్నో అధ్యయనాలు చేసిన తర్వాతే మద్యం దుకాణాలు తెరిచేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. మద్యం అందుబాటులో లేకపోతే గుడుంబా వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

By

Published : May 6, 2020, 8:31 PM IST

excise minister srinivas goud give clarity on wine shops opening
మద్యం లేకపోతే మళ్లీ గుడుంబా వస్తది: శ్రీనివాస్ గౌడ్

కరోనా విషయంలో సీఎం కేసీఆర్​ ఎన్నో అధ్యయనాలు చేసిన తర్వాతే... రాష్ట్రంలో గుడుంబా, కల్తీ మద్యం నిషేధం కోసమే వైన్​ షాప్​లు తెరిచినట్టు ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ స్పష్టం చేశారు. మద్యం అందుబాటులో లేకపోతే మళ్లీ గుడుంబా వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జడ్చర్లలో గుడుంబా తయారీని అడ్డుకునేందుకు యత్నించిన సిబ్బందిపై నిందితులు దాడి చేసినట్టు తెలిపారు. గుడుంబా నిషేధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.

సరిహద్దు రాష్ట్రాల్లో ముందుగానే మద్యం దుకాణాలు తెరిచినందున కల్తీ మద్యం రాష్ట్రంలోకి వచ్చిందని మంత్రి అన్నారు. మిగతా రాష్ట్రాల కంటే మెరుగైన చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేటట్టు, శానిటైజర్లు అందబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామన్నారు. వినియోగదారులు గొడుగులు తీసుకెళ్లాలని సూచించారు. పర్మిట్​ రూంలకు అనుమతి లేదన్న మంత్రి... లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాల లైసెన్స్​ రద్దు చేసినట్టు తెలిపారు. కంటైన్మెంట్​ జోన్లలో ఉన్న 6 దుకాణాలు తెరవలేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:మద్యం అమ్మకాలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details