తెలంగాణ

telangana

ETV Bharat / city

కర్రసాముతో ఆకట్టుకుంటున్న.. చిచ్చరపిడుగులు - కర్ర సాము

పిల్లలకు పాఠశాలపై మక్కువ పెంచేందుకు సర్కారు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నో బ్యాగ్​డే పేరుతో ఆట విడుపుగా ప్రకటించి ఆ రోజు పిల్లల్లో ఉన్న నైపుణ్యం వెలికితీసే కార్యక్రమాలు చేపడుతోంది. ఏదైనా నూతనంగా ప్రయత్నించాలని ఓ ఉపాధ్యాయుడు పిల్లలకు కర్రసాములో తర్ఫీదు నిస్తున్నాడు. కడపజిల్లా మైదుకూరు మండలం శ్రీ రాంనగర్​ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కలం పట్టిన చేతితోనే కర్రసాముపై పట్టుసాధిస్తున్నారు.

కర్రసాముతో ఆకట్టుకుంటున్న..చిచ్చరపిడుగులు

By

Published : Sep 12, 2019, 10:46 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా మైదకూరు మండలం శ్రీరాంనగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బలాన్ని ప్రసాద్ కర్రసాములో ఆరితేరాడు. విద్యార్థులకు నేర్పిస్తే బాగుంటుందని భావించారు. నో బ్యాక్ డే రోజున ఇద్దరు విద్యార్థులకు కర్రసాము మెళకువలు నేర్పించారు. నాలుగైదు తరగతుల్లో 20 మంది విద్యార్థులు ఉండగా మరో 13 మంది ముందుకొచ్చారు. విద్యార్థులంతా పోటీపడి మరీ కర్రను గిర్రున తిప్పుతున్నారు. బాలురతో పాటు బాలికలు కూడా సత్తా చాటుతున్నారు. కేవలం మూడు వారాల్లోనే ప్రావీణ్యం సంపాదించారు.

కర్రసాముతో ఆకట్టుకుంటున్న..చిచ్చరపిడుగులు

ABOUT THE AUTHOR

...view details